వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Budget 2020 : ఆదాయ పన్ను రేట్లు తగ్గింపు.. కానీ మెలిక పెట్టిన సీతారామన్

|
Google Oneindia TeluguNews

Recommended Video

#Budget2020 : Income Tax Slab Revised But Here Is the Twist And Choice is Yours ?

ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్-2020లో ఆదాయ పన్ను శ్లాబ్‌లపై సామాన్యుల్లో కాస్త గందరగోళం నెలకొంది. పన్ను రేట్లను తగ్గిస్తూనే మెలిక పెట్టడంపై చర్చ జరుగుతోంది. కొత్త శ్లాబ్ విధానంలో పన్ను తగ్గింపు కోరుకునేవారు ఇప్పటివరకు వస్తున్న పన్ను రిబేట్లను వదులుకోవాల్సి ఉంటుందని నిర్మలా మెలిక పెట్టారు. అంటే కొన్ని రిలీఫ్స్,మినహాయింపులను వదులుకోవడానికి సిద్దంగా ఉండేవారికి ఇవి వర్తిస్తాయని తెలిపారు. కొత్త పన్ను విధానంతో పాటు పాత పన్ను విధానం కూడా అమలులో ఉంటుందని.. రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుందన్నారు. దీంతో కొత్త పన్ను విధానం కింద వచ్చే ట్యాక్స్ మినహాయింపులు కావాలా..? లేక 80సీ పన్ను విధానంలో వచ్చే రిబేట్లు కావాలా..? అన్నది ఉద్యోగులు తేల్చుకోవాల్సి ఉంటుంది.

పన్ను రేట్లు..

పన్ను రేట్లు..

ఇక తాజా పన్ను విధానంలో రూ.0 నుంచి రూ.5లక్షల వరకు ఎలాంటి పన్ను లేదని ప్రకటించారు.రూ.5 లక్షల నుంచి రూ.7.5లక్షల వరకు రూ.10 శాతం పన్ను విధించారు. రూ.7.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు 15శాతం పన్ను విధించారు.రూ.10లక్షల నుంచి రూ.12.5లక్షల వరకు 20శాతం పన్ను విధించారు. రూ.12.5 లక్షల నుంచి రూ.15లక్షల వరకు 25 శాతం పన్ను విధించారు.రూ.15లక్షలకు పైగా వేతనం పొందే వారు 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నారు. తాజా పన్ను సంస్కరణలతో ప్రభుత్వంపై ఏడాదికి రూ.40వేల కోట్ల భారం పడనున్నట్టు తెలిపారు.ఆదాయ పన్నును సరళీకృతం చేయడమే తమ ఉద్దేశం అని సీతారామన్ ప్రకటించారు.

 పన్ను కేటాయింపులు..

పన్ను కేటాయింపులు..


కేటాయింపుల విషయానికొస్తే.. ఎస్సీ సంక్షేమానికి రూ.85వేల కోట్లు,జమ్మూకశ్మీర్ అభివృద్దికి రూ.30750కోట్లు,గ్రామీణాభివృద్దికి 2.83లక్షల కోట్లు,విద్యారంగానికి రూ. రూ.90వేల కోట్లు,
మౌలిక రంగానికి రూ.1.03లక్షల కోట్లు,విద్యుత్ రంగానికి రూ.22వేల కోట్లు,రవాణా రంగానికి రూ.1.70లక్షలు,పర్యాటక రంగానికి రూ.2500కోట్లు,క్లీన్ ఎయిర్ పాలసీ రూ.4400కోట్లు
ఆయుష్మాన్ భారత్‌కు రూ.6వేల కోట్లు,జల్‌జీవన్ రూ.3.06కోట్లు,స్కిల్ డెవలప్‌మెంట్ 3వేల కోట్లు,బ్యాంకింగ్‌కు రూ.3.5లక్షల కోట్లు కేటాయించారు.

నిరుద్యోగాన్ని తగ్గించే చర్యలేవి..

నిరుద్యోగాన్ని తగ్గించే చర్యలేవి..

తాజా బడ్జెట్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పెదవి విరిచారు. దేశం తీవ్ర నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్న వేళ.. ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం అన్నారు. యువత ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఎలాంటి వ్యూహాత్మక ఆలోచనలను బడ్జెట్‌లో ప్రస్తావించలేదన్నారు. బడ్జెట్‌లో స్కిల్ డెవలప్‌మెంట్‌కు రూ.3వేల కోట్లు మాత్రమే కేటాయించడంపై నిపుణులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగాన్ని తగ్గించాలంటే స్కిల్ డెవలప్‌మెంట్‌ను విస్తృతంగా చేపట్టాలని,ఇంత తక్కువ నిధులతో అది సాధ్యం కాదని అంటున్నారు.

English summary
Nirmala Sitharaman has changed income tax slabs and rates for those foregoing exemptions, deductions
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X