వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Union Budget 2020: నిర్మలా సీతారామన్ బడ్జెట్ నుంచి ఏమి ఆశించవచ్చు..?

|
Google Oneindia TeluguNews

Recommended Video

#Budget2020 : Nirmala Sitharaman Arrives At Parliament With 'Bahi Khata'

న్యూఢిల్లీ: దేశ ఆర్థికవ్యవస్థ దయనీయ పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో కేంద్రం శనివారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై దేశం మొత్తం చూస్తోంది. గత పదేళ్లలో ఎప్పుడూ లేనంతగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యింది. ఈ క్రమంలోనే నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఎలా ఉంటుందో అనేదానిపై ఆర్థిక నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే వినియోగదారుడి డిమాండ్, పెట్టుబడుల వచ్చేందుకు నిర్మలా సీతారామన్ చర్యలు తీసుకుని ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెడుతుందా..?


కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తిస్థాయిలో తొలి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మందగించిన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు సరికొత్త రోడ్‌ మ్యాప్‌తో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. 2025 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్న అంచనాలు ఉండటంతో ఆ లక్ష్యాన్ని చేరుకునేలా సీతారామన్ బడ్జెట్ ఉండబోతోందనే ప్రచారం ఢిల్లీలో జరుగుతోంది. కార్పొరేట్ పన్నుల్లో కోత విధించినప్పటికీ పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వం విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పెట్టుబడులను ఆకర్షించడంలో విఫలం


కార్పొరేట్ పన్నుల్లో గతేడాది సెప్టెంబర్‌లో కోత విధించగా తాజాగా శనివారం నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో వ్యక్తిగత పన్నులపై కూడా ఊరట కల్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సాధారణ పన్ను మినహాయింపు పరిమితిని తగ్గించడం లేదా అధిక ఆదాయం ఉన్నవారికి సరికొత్త టాక్స్ స్ట్రక్చర్ తీసుకురావడం కూడా జరిగే అవకాశాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం గత నాలుగు నెలలుగా కొన్ని ఊరట నిచ్చే అంశాలను ప్రకటించినప్పటికీ వినియోగదారుడికి కాన్ఫిడెన్స్ ఇవ్వడంలో విఫలమైంది. గృహ రుణాలు లేదా వాహనాలు కొనేందుకు రుణాలు తీసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపడం లేదు. సాధారణ వ్యక్తికి భరోసా ఇవ్వడంలో దేశ ఆర్థిక వ్యవస్థ విఫలమైందన ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి చెప్పారు. ఈ సారి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ కచ్చితంగా సాధారణ వ్యక్తికి బూస్టప్ ఇచ్చేలా ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాదు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే బడ్జెట్ రాబోతోందని ఆయన అన్నారు. ఇన్వెస్ట్‌మెంట్స్‌ వచ్చేలా బడ్జెట్ ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

రైతులకు ఊరటనిస్తుందా..?

ఇక ప్రధాని కిసాన్ పథకం కింద రైతులకు కేటాయిస్తున్న బడ్జెట్‌పై కూడా కేంద్రం దృష్టిసారించినట్లు సమాచారం. ఈ సారి రైతుల కోసం కేటాయిస్తున్న బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వాలను కూడా భాగస్వామి చేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. ఇక రెన్యూవబుల్ ఎనర్జీ, ఈ-వెహికల్, విద్యుత్, గృహాలు, రియల్ ఎస్టేట్, ఎగుమతుల రంగాలకు కూడా కేంద్రం ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక ఫైనాన్స్ మార్కెట్లు కూడా కొంత ఊరటను ఆశిస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మూలధనం పెంచడం, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో నగదు ప్రవాహం ఉండేలా జాగ్రత్త చర్యలు తీసుకోవడం అనేది కూడా పరిశీలనలో ఉంది.

సమతుల్యత పాటిస్తారా..?

ఇక సామాజిక రంగాలకు కూడా ఈ బడ్జెట్‌లో ప్రధాన్యత దక్కనుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యుదీకరణ, మహాత్మాగాంధీ ఉపాధి పథకం, ఆరోగ్యం, విద్య, శిక్షణ నైపుణ్యత కేంద్రాలకు కూడా బడ్జెట్‌లో ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంది. ఓవైపు ఆర్థిక వృద్ధిని పెంచేందుకు చర్యలు తీసుకుంటూనే మరోవైపు ఆర్థిక లోటును పూడ్చి సమతుల్యత ఉండేలా చూడటం సీతారామన్ ముందున్న సవాళ్లుగా నిపుణులు చెబుతున్నారు.

English summary
The Union Budget 2020 will be presented today. There are a host of expectations from the Budget to be presented by Union Finance Minister, Nirmala Sitharaman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X