Union Budget 2026 LIVE Updates:నిర్మలమ్మ 'నవమ'బడ్జెట్.. సామాన్యుడి ఆశలు నెరవేరేనా?
దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని నిర్దేశించే కేంద్ర బడ్జెట్ 2026-27ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు (ఫిబ్రవరి 1) పార్లమెంటులో ప్రవేశపెట్టారు. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను సమర్పిస్తూ ఆమె సరికొత్త రికార్డు సృష్టించారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఆదివారం నాడు బడ్జెట్ ప్రసంగం జరుగుతుండటం విశేషం. ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రారంభమైన ఈ ప్రసంగంపై మధ్యతరగతి ప్రజల నుంచి పారిశ్రామికవేత్తల వరకు అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులు ఉంటాయా? నిత్యావసరాల ధరలకు కళ్లెం పడుతుందా? అన్నది మరికొద్ది సేపట్లో తేలిపోనుంది.
అభివృద్ధి మంత్రం.. ఎన్నికల రాష్ట్రాలపై వరాల జల్లు!
ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలు, వ్యవసాయం , ఉపాధి కల్పనకు పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా డిజిటల్ ఇండియా, గ్రీన్ ఎనర్జీ రంగాలకు భారీ కేటాయింపులు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టే దిశగా కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది? 'మేక్ ఇన్ ఇండియా'కు కొత్త ఊపిరి పోసే పథకాలు ఏవి? ప్రతి కీలక ప్రకటనను, లైవ్ అప్‌డేట్స్‌ను, నిపుణుల విశ్లేషణలను క్షణక్షణం మీ ముందుకు తెస్తున్నాం. తాజా సమాచారం కోసం మా లైవ్ బ్లాగ్‌ను ఫాలో అవ్వండి!













Click it and Unblock the Notifications