వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల తాయిలాం: వర్సిటీ, కాలేజీల్లో రొస్టర్ విధానానికి ఓకే ... ఆర్డినెన్స్ తీసుకొచ్చిన కేంద్రం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : లోక్ సభ ఎన్నికల సమరశంఖం పూరించనున్న నేపథ్యంలో అన్నివర్గాలను ఆకట్టుకునేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ముమ్మర ప్రయత్నిస్తోంది. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు, బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం పొందని బిల్లులను ఆర్డినెన్స్ రూపంలో తీసుకొస్తోంది. ఇప్పటికే త్రిపుల్ తలాక్ .. తదితర బిల్లులు రాజ్యసభలో చర్చ జరగకపోవడంతో ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విశ్వవిద్యాలయాల్లో టీచర్ల ఎంపికకు రొస్టర్ విధానం పాటించేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్టు మంత్రివర్గ సమావేశం తర్వాత కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు వివరించారు.

కశ్మీర్ వ్యాపారులపై విశ్వహిందూ దళ్ ప్రతాపం .. లక్నో నడిబొడ్డున పిడిగుద్దులు .. సోషల్ మీడియాలో వైరల్కశ్మీర్ వ్యాపారులపై విశ్వహిందూ దళ్ ప్రతాపం .. లక్నో నడిబొడ్డున పిడిగుద్దులు .. సోషల్ మీడియాలో వైరల్

ఎన్నికలకు ముందు తాయిలం ..

ఎన్నికలకు ముందు తాయిలం ..

ఎన్నికలకు ముందు టీచర్లకు కేంద్రం తాయిలం ప్రకటించింది. వర్సిటీల్లో టీచర్ల ఎంపిక విధానంలో రోస్టర్ పాటిస్తామని ఆర్డినెన్స్ జారీచేసింది. దీనిపై వివిధ టీచర్, విద్యార్థి సంఘాల నుంచి వచ్చిన వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. దీంతో 200 పాయింట్ కొత్త రోస్టర్ విధానం అమల్లోకి రానుంది.

టీచర్ల ఆందోళన .. దిగొచ్చిన కేంద్రం

టీచర్ల ఆందోళన .. దిగొచ్చిన కేంద్రం

అలహాబాద్ హైకోర్టు 2017 తీర్పును అనుసరించి ఎస్సీ, ఎస్టీల టీచర్ పోస్టులను కేటాయిస్తామని గతేడాది యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ప్రకటించింది. కానీ అమలుకాలేదు. ఈ క్రమంలో గత నెలలో కేంద్ర మానవవనరుల శాఖ అలహాబాద్ తీర్పుపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయగా .. సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా విద్యార్థి, టీచర్ సంఘాలు ఆందోళన చేపట్టాయి. దీంతో దిగొచ్చిన కేంద్రం .. రొస్టర్ విధానంలో టీచర్ పోస్టులను నియమిస్తామని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ హామీనిచ్చారు.

ఆర్డినెన్స్ ద్వారా ఊరట

ఆర్డినెన్స్ ద్వారా ఊరట

ఆర్డినెన్స్ తీసుకొచ్చి .. టీచర్ల చిరకాల వాంఛను నెరవేర్చబోతోంది. ఈ క్రమంలోనే కొన్ని సంస్థలు ఆందోళన చేపడుతామని హెచ్చరించగా .. మీరేందుకు ఆందోళనకు పునుకుంటారు. మీకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. రెండురోజుల్లో మీకు శుభవార్త చెబుతాను ‘ అని ప్రకాశ్ జవదేకర్ రెండురోజుల ముందు టీచర్ల తో చెప్పారు. అన్నట్టుగానే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాట నిలబెట్టుకున్నారు.

English summary
The Union Cabinet on Thursday approved an ordinance on the reservation mechanism for university teachers during what is speculated to be its last meeting before the general elections. Various students' and teachers' organisations had been urging the government to bring an ordinance to restore the 200-point roster taking college or university as a unit for reservation in teaching posts. The University Grants Commission (UGC) had announced last March that an individual department should be considered as the base unit to calculate the number of teaching posts to be reserved for the Scheduled Castes (SC) and Scheduled Tribes (ST) candidates, following an order by the Allahabad High Court in April 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X