ద‌క్షిణాదిన పాగా వేయాలంటే?: అమిత్ షా విందు రాజ‌కీయం: వైఎస్ జ‌గ‌న్‌, కేసీఆర్‌ల‌కు ఆహ్వానం?

Recommended Video

    Exit Polls 2019 : వైఎస్ జ‌గ‌న్‌, కేసీఆర్‌ల‌కు ఆహ్వానం..? || Oneindia Telugu

    న్యూఢిల్లీ: తుది ద‌శ ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన వెంటనే దేశ‌వ్యాప్తంగా వెల్లువెత్తిన ఎగ్జిట్ పోల్స్‌.. భార‌తీయ జ‌న‌తాపార్టీ, ఎన్డీఏ మిత్ర ప‌క్షాల్లో జోష్ నింపాయి. బీజేపీ సొంతంగా కేంద్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి అవ‌స‌ర‌మైన సీట్ల‌ను సాధిస్తుందంటూ అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించాయి. అయిదేళ్ల నరేంద్ర మోడీ ప్ర‌భుత్వ ప‌నితీరును మెచ్చుకుని ప్ర‌జ‌లు వ‌రుసగా రెండోసారి ప‌ట్టం క‌ట్టబోతున్నార‌ని బీజేపీ భావిస్తోంది. ఈ అయిదేళ్ల వ్య‌వ‌ధిలో తాము దాదాపు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు చేరువ కాగ‌లిగామ‌ని, అందుకే- అనూహ్యంగా 300ల‌కు పైగా లోక్‌స‌భ స్థానాల్లో తాము జెండా పాత‌బోతున్నామ‌ని బీజేపీ నాయ‌కులు చెబుతున్నారు.

    త‌ట‌స్థుల‌కు గాలం..

    త‌ట‌స్థుల‌కు గాలం..

    ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని- బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా కేంద్ర మంత్రివ‌ర్గ స‌భ్యుల‌కు విందు ఇవ్వ‌బోతున్నారు. మంగ‌ళ‌వారం రాత్రి న్యూఢిల్లీలో విందును ఏర్పాటు చేశారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ కూడా ఈ విందుకు హాజ‌రు కానున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ల‌కు స‌మ దూరాన్ని పాటిస్తోన్న త‌టస్థ రాజ‌కీయ పార్టీల నాయ‌కుల‌ను కూడా ఈ విందుకు ఆహ్వానించాల‌ని బీజేపీ నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, తెలంగాణ ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు, ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్‌ల‌ను ఆహ్వానితుల జాబితాలో ఉండొచ్చ‌ని అంటున్నారు.

    ద‌క్షిణాదిన బ‌ల‌ప‌డ‌టానికి ప్రాంతీయ పార్టీల స‌హ‌కారం..

    ద‌క్షిణాదిన బ‌ల‌ప‌డ‌టానికి ప్రాంతీయ పార్టీల స‌హ‌కారం..

    ద‌క్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురు గాలి వీస్తుంద‌ని ఎగ్జిట్ పోల్స్ నిర్ధారిచడం.. బీజేపికి పంటి కింద రాయిల వంటిదే. ద‌క్షిణాదిన ఒక్క క‌ర్ణాట‌క మిన‌హా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో క‌మ‌లం వికసించ‌డం ఇప్ప‌ట్లో సాధ్యం కాద‌ని ఎగ్జిట్ పోల్స్ తేల్చి ప‌డేశాయి. క‌ర్ణాట‌క మిన‌హాయించి, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, కేర‌ళ‌ల‌ల్లో బీజేపీ క‌నీసం ఖాతా కూడా తెరిచే అవ‌కాశం లేదంటూ తాజాగా ఎగ్జిట్ పోల్స్ స్ప‌ష్టం చేశాయి. దీనితో- బీజేపీ నాయ‌కులు ఇక ద‌క్షిణాది రాష్ట్రాల‌పై క‌న్నేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

    హిందీ ప్రాబ‌ల్యం ఉన్న రాష్ట్రాల్లో తిరుగులేని మెజారిటీని సాధించబోతున్నామని, ఈ ప‌రిస్థితుల్లో ద‌క్షిణాదిన పార్టీని బ‌లోపేతం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటూ ఆ పార్టీ జాతీయ ప్ర‌తినిధి రామ్ మాధ‌వ్ సైతం చెప్పుకొచ్చారు.
    నిజానికి- బీజేపీకి హిందీ పార్టీగా అనే పేరు ఉంది. అందుకే- ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన స్థాయిలో ఓట్లు ప‌డ‌వు. పైగా ప్రాంతీయ పార్టీల హ‌వా అధికం. మ‌న రాష్ట్రంలో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ‌లో టీఆర్ఎస్‌, త‌మిళ‌నాడులో డీఎంకే, అన్నా డీఎంకే వంటి ప్రాంతీయ పార్టీల‌ను కాద‌ని జాతీయ పార్టీలు బ‌ల‌ప‌డ‌టం అసాధ్యం. ఈ ప‌రిస్థితుల్లో ఆయా పార్టీల‌ను స్నేహ సంబంధాల‌ను కొన‌సాగిస్తేనే.. ద‌క్షిణాదిన బ‌ల‌ప‌డ‌గ‌ల‌మ‌ని బీజేపీ భావిస్తోంది.

    ద‌క్షిణాన క‌నిపించేది వారే..

    ద‌క్షిణాన క‌నిపించేది వారే..

    ఒక్క‌సారి ద‌క్షిణాది రాజ‌కీయాల వైపు చూపులు సారిస్తే.. ఆ పార్టీకి క‌నిపించేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర స‌మితి మాత్ర‌మే. త‌మిళ‌నాడులో అన్నా డీఎంకేతో ఎలాగూ సీట్ల స‌ర్దుబాటు చేసుకుంది. కేర‌ళ‌లో క‌లిసి వ‌చ్చే వారెవ‌రూ లేరు. తెలంగాణ‌లో టీఆర్ఎస్ ప‌ట్టించుకోవ‌ట్లేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చంద్ర‌బాబు చేతిలో వెన్నుపోటుకు గుర‌య్యామ‌నే ఆవేద‌న బీజేపీ నాయ‌కుల్లో వ్యక్త‌మౌతోంది. ఈ పరిస్థితుల్లో త‌మ‌ను ప‌ట్టించుకోని టీఆర్ఎస్‌కు గాలం వేయ‌డం, త‌ట‌స్థ వైఖ‌రిని అనుస‌రిస్తోన్న వైఎస్ఆర్ సీపీని ద‌గ్గ‌ర చేర్చుకోవ‌డం ఒక్క‌టే మిగిలి ఉంది.

     ఏపీకి ప్రత్యేక హోదా.. మరి తెలంగాణకు?

    ఏపీకి ప్రత్యేక హోదా.. మరి తెలంగాణకు?

    దీన్ని దృష్టిలో ఉంచుకుని- మంగ‌ళవారం రాత్రి నిర్వ‌హించబోయే విందుకు- వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, కే చంద్ర‌శేఖ‌ర్ రావులు, న‌వీన్ ప‌ట్నాయ‌క్‌ల‌తో పాటు మ‌రికొంద‌రిని విందుకు పిలవాల‌ని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించుకున్నార‌నే వార్త‌లు దేశ రాజ‌ధానిలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే..ఏ పార్టీకి అయినా తాము మద్దతు ఇస్తామని వైఎస్ జగన్ ముందు నుంచీ చెబుతూనే వస్తున్నారు.

    ఈ నేపథ్యంలో- వైఎస్ జగన్ కోరుకున్న విధంగా ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వగలిగితే- అటు రాజకీయంగా కూడా బలపడటానికి అవకాశం ఉంటుందనేది బీజేపీ నేతల వ్యూహం. ఇక- కేసీఆర్ తో స్నేహ సంబంధాలను కొనసాగించడానికి బీజేపీ ఎలాంటి వ్యూహం పన్నుతుందనేది ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే- తాను ఒంటరి పోరాటం సాగించి, సాధించుకున్న తెలంగాణలో మరో పార్టీ పాగా వేయడం కేసీఆర్ కు సుతారామూ ఇష్టం లేదని, అందుకే ఆయన విషయంలో ఆచితూచి స్పందించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+