Amit shah: 35 సీట్లు ఇవ్వండి చాలు.. బెంగాల్‍లో అమిత్ షా..
2024 లోక్‌సభ ఎన్నికల్లో మాకు 35 సీట్లు ఇవ్వండి, మీరు రామనవమి వేడుకలను శాంతియుతంగా నిర్వహించేలా చూస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit shah) హామీ ఇచ్చారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం పశ్చిమ బెంగాల్‌కు చేరుకున్న అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. బీర్‌భూమ్‌లో జరిగిన ర్యాలీలో అమిత్ షా ప్రసంగిస్తూ, "బెంగాల్‌లో రామనవమి ఊరేగింపులను నిర్వహించలేరా? వారిపై దాడి చేస్తారా?" అని ప్రశ్నించారు. "దీదీ (మమతా బెనర్జీ) బుజ్జగింపు వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, రామనవమి ఊరేగింపుపై దాడి చేసే ధైర్యం ఎవరికీ ఉండదు" అని షా అన్నారు.
దీదీ నేరాలకు వ్యతిరేకంగా పోరాటం చేసే ఏకైక పార్టీ బిజెపి అని అన్నారు. బెంగాల్‌ను ఉగ్రదాడి నుంచి విముక్తి చేయాలంటే బీజేపీ ఒక్కటే మార్గమన్నారు. బెంగాల్‌లో చొరబాట్లను అరికట్టాలంటే 2024లో తమకు 35 సీట్లు ఇవ్వండని కోరారు. దీదీకి తన మేనల్లుడును ముఖ్యమంత్రిని చేయాలనే ఆసక్తి మాత్రమే ఉందని షా విమర్శించారు. మమతా దీదీ ఆమె తర్వాత మేనల్లుడు సీఎం అవుతాడని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.

"పాకిస్తాన్‌కు మమతా బెనర్జీ గట్టి సమాధానం ఇవ్వగలరా? మమత కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ఎదుర్కోగలదా? ప్రధాని మోదీ మాత్రమే చేయగలరు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, మమతా బెనర్జీ, అందరూ రామమందిర నిర్మాణాన్ని ఏళ్ల తరబడి ఆపేశారు.. ఒక మంచి రోజు ద్వారాలు తెరిచింది ప్రధాని మోడీ" అని అన్నారు. ఈ పర్యటనలో రాష్ట్రంలో బీజేపీకి ఉన్న సంస్థాగత బలాన్ని అమిత్ షా పరిశీలించనున్నారు. వచ్చే నెలలో జరగనున్న గ్రామీణ ఎన్నికలకు ముందు ఆయన పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తున్నారు. అమిత్ షా పర్యటన వేళ.. పశ్చిమ బెంగాల్‌లో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమవడం కలకలం రేపుతోంది. బీర్‌భూమ్ జిల్లాలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఓ కారులో 3400 డిటోనేటర్లను పోలీసులు గుర్తించారు.
గుస్లారా బైపాస్ సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఓ స్కార్పియో కారు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. కారులో 17 బాక్సులు ఉండగా.. వాటిని తెరిచి చూడగా ఒక్కో బాక్సులో 200 వరకు జిలెటిన్ స్టిక్స్ ఉన్నాయి. దీంతో పోలీసులు వెంటనే బాంబు స్క్వాడ్‌ను పిలిపించి పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేయించారు.












Click it and Unblock the Notifications