దంతెవాడ ఘటనపై కేంద్రం ఆగ్రహం- ఛత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ బఘేల్ కు అమిత్ షా హామీ..

ఛత్తీస్ ఘడ్ లోని మావోయిస్టు ప్రభావిత దంతెవాడ జిల్లాలో ఇవాళ మావోయిస్టులు బాంబుపేల్చిన ఘటన కలకలం రేపుతోంది. కూంబింగ్ లో పాల్గొంటున్న పోలీసుల్ని టార్గెట్ చేస్తూ మావోయిస్టులు పేల్చిన బాంబు 10 మందికి పైగా పోలీసుల ప్రాణాలు తీసింది. వీరితోపాటు వారి వాహనం డ్రైవర్ కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై కేంద్రంతో పాటు ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాయి.

దంతెవాడలో మావోయిస్టులు పోలీసు వాహనాన్ని పేల్చేసిన ఘటనపై స్పందించిన ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్.. ఇదో దురదృష్టకరమైన ఘటన అని పేర్కొన్నారు. దీనిపై ఇప్పుడే సమాచారం అందిందన్నారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. నక్సల్స్ తో పాటు చివరి దశలో ఉందని, వారిని వదిలిపెట్టే సమస్యే లేదన్నారు.

amit shah talks with chattisgarh cm bhagel

అనంతరం ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఘటనపై ఆరా తీశారు. ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వానికి అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

జిల్లా రిజర్వ్ పోలీసు గార్డ్స్ ను తీసుకెళ్తున్న వాహనంపై దాడి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమిత్ షా.. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి బాధ్యులను మట్టుపెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు హోంశాఖ వర్గాలు వెల్లడించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+