వ్యాపం: ప్రణబ్‌తో రాజ్ భేటీ, గవర్నర్‌పై వేటు?
న్యూఢిల్లీ: వ్యాపమ్ కిల్లింగ్ స్కామ్ తో సంబంధం ఉందన్న ఆరోపణలు ఎదుర్కోంటున్న మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ మీద వేటు తప్పదని తెలుస్తుంది. గురువారం రాత్రి లేదా శుక్రవారం గవర్నర్ పదవి నుండి రాం నరేష్ యాదవ్ ను తప్పిస్తారని విశ్వసనీయంగా తెలిసింది.
వ్యాపం స్కాం కేసు, ఆ కేసులోని నిందితులు, సాక్షుల అనుమానాస్పద మరణాల కేసులను దర్యాప్తు చెయ్యాలని గురువారం సుప్రీం కోర్టు సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇదే సందర్బంలో మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని సుప్రీం కోర్టు ప్రశ్నించి నోటీసులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జిని కలిసి రామ్ నరేష్ యాదవ్ విషయంపై చర్చించనున్నారు. గురువారం సాయంత్రం ప్రణబ్ ముఖర్జీ, రాజ్ నాథ్ సింగ్ కలవనున్నారని కేంద్ర హోం శాఖ వర్గాలు తెలిపాయి.
వ్యాపం స్కాంలో రామ్ నరేష్ యాదవ్, ఆయన కుమారుడు శైలేష్ యాదవ్ లు ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. అయితే శైలేష్ యాదవ్ సైతం అనుమానాస్పద స్థితిలో మరణించారు. గవర్నర్ కార్యాలయంలోనే శైలేష్ యాదవ్ రూ. 3 లక్షలు లంచం తీసుకున్నారని ఆ కేసులో అరెస్టు అయిన వ్యక్తి పోలీసులకు చెప్పాడు.












Click it and Unblock the Notifications