ఐక్యరాజ్య సమితి విఫలం - ఆ గ్రూపులు పుట్టుక వెనుక : కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..!!

ఐక్యరాజ్య సమితి విఫలం అవ్వడంతోనే మధ్యలో జీ7, జీ20 గ్రూపులు పుట్టుకొచ్చాయని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ పేర్కొన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. ఉక్రెయిన్‌లో వేల మంది భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయారని గుర్తు చేసారు. వారిని తీసుకువచ్చేందుకు మన దేశం చేసినట్లు ఏ దేశం ప్రయత్నించలేదని చెప్పారు. చైనా దేశం సరిహద్దు చట్టాలు, ఒప్పందాలను మీరిందన్నారు. అయినప్పటికీ వాణిజ్య వ్యవహారాల మధ్య ఎక్కడా ఇబ్బంది రాకుండా చూశామని చెప్పారు.

19 విమానాల్లో 25 వేల మంది విద్యార్థులను ఉక్రెయిన్ నుంచి తీసుకొచ్చామని వివరించారు. ఈ అంశంలో ప్రపంచ దేశాలు భారత్ ను ప్రశంసించాయని చెప్పారు. ప్రపంచానికి ప్రస్తుతం మన దేశం ఒక ఫార్మసీ హబ్‌గా మారిందన్నారు. కొవిడ్‌ సమయంలో మన దేశం నుంచి వేల టీకాలు ఇతరులకు అందించామని చెప్పారు. కొవిడ్‌ సమయంలో వందేభారత్‌ మిషన్‌లో 17 లక్షల మందిని మన దేశానికి తీసుకొచ్చామని వివరించారు.

Union Minister for External Affairs S Jaishankar key comments on the failure of UN groups

కొవిడ్‌ సమయంలో మన దేశం నుంచి వేల టీకాలు ఇతరులకు అందించామన్నారు. గరీబ్‌ కల్యాణ్‌ యోజనతో 890 మంది మిలియన్‌ ప్రజలకు లబ్ది చేకూరుతోదని చెప్పుకొచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన పథకాలతో దేశ ఆర్దిక - సామాజిక ప్రగతి మారిందన్నారు. పాస్‌పోర్టు సేవలను పోస్టాఫీసుల్లోనూ అందిస్తున్నామని కేంద్ర మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమం పేదల కోసమేనని మంత్రి జై శంకర్ స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+