సీఎం స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడతారా?: కేసీఆర్ వ్యాఖ్యలపై గజేంద్ర షెకావత్ తీవ్ర స్పందన
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్. ఏపీ-తెలంగాణ మధ్య నీటి పంపకాలకు సంబంధించి కేసీఆర్ ఇటీవల మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి తీవ్రంగా స్పందించారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంపై ఆయన గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

కేసీఆర్ రెండ్రోజులని చెప్పి.. 8 నెలల చేశారు..: కేంద్రమంత్రి షెకావత్
కేసీఆర్ ఇటీవల మీడియా సమావేశాల్లో తన పేరు ప్రస్తావించారని.. అందుకే కేసీఆర్ లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందని కేంద్రమంత్రి షెకావత్ తెలిపారు. ప్రజలకు, దేశానికి నిజాలు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తెలంగాణ, ఏపీ మధ్య నీటి పంపకాల కోసం కొత్త ట్రైబ్యునల్ కోసం సీఎం కేసీఆర్ అడిగారని తెలిపారు. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారని, కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని కేంద్రమంత్రి తెలిపారు. ఈ క్రమంలోనే పిటిషన్ వెనక్కి తీసుకోవాలని అడిగానని.. రెండ్రోజుల్లో పిటిషన్ వెనక్కి తీసుకుంటామని కేసీఆర్ తెలిపారని చెప్పారు. సుప్రీంకోర్టు నుంచి కేసు వెనక్కి తీసుకునేందుకు 8 నెలలు పట్టిందని తెలిపారు. నెల రోజుల క్రితమే పిటిషన్ వెనక్కి తీసుకునేందుకు సుప్రీంకోర్టు అంగీకరించిందని తెలిపారు. అప్పటి నుంచి కేంద్రం నిర్వర్తించాల్సిన కార్యక్రమం మొదలైందన్నారు.

తనను, కేంద్రాన్ని కేసీఆర్ ఎలా బాధ్యత చేస్తారంటూ షెకావత్ ఫైర్ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు సీఎంలతో కలిసి అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగిందని తెలిపారు. చాలా నుంచి జరగాల్సిన సమావేశాన్ని చొరవ తీసుకుని ఏర్పాటు చేశామని చెప్పారు. ఏడేళ్లు ఆలస్యం కావడానికి తాను, కేంద్రం ఎలా బాధ్యత వహిస్తామని ప్రశ్నించారు కేంద్రమంత్రి షెకావత్. రెండు రాష్ట్రాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయని, రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ ముందుకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. ప్రధాని కూడా సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారని కేంద్రమంత్రి షెకావత్ తెలిపారు. పరిధి నోటిఫై కానంతవరకు బాధ్యత ఎలా కొనసాగిస్తారు? ఇద్దరు సీఎంలు ఒప్పుకున్న తర్వాతే.. బోర్డుల పరిధిని నోటిఫై చేశారన్నారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు సీఎంలతో కలిసి అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగిందని తెలిపారు. చాలా నుంచి జరగాల్సిన సమావేశాన్ని చొరవ తీసుకుని ఏర్పాటు చేశామని చెప్పారు. ఏడేళ్లు ఆలస్యం కావడానికి తాను, కేంద్రం ఎలా బాధ్యత వహిస్తామని ప్రశ్నించారు కేంద్రమంత్రి షెకావత్. రెండు రాష్ట్రాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయని, రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ ముందుకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. ప్రధాని కూడా సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారని కేంద్రమంత్రి షెకావత్ తెలిపారు. పరిధి నోటిఫై కానంతవరకు బాధ్యత ఎలా కొనసాగిస్తారు? ఇద్దరు సీఎంలు ఒప్పుకున్న తర్వాతే.. బోర్డుల పరిధిని నోటిఫై చేశారన్నారు.
Recommended Video

అంతా డ్రామా.. సీఎం స్తాయి వ్యక్తి ఇలానా?: కేసీఆర్‌పై షెకావత్ విమర్శలు
తెలుగు రాష్ట్రాల మధ్య వివాద పరిష్కారానికి ట్రైబ్యునల్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. న్యాయ మంత్రిత్వశాఖ అభిప్రాయం కోరామని, దాని కోసం వేచి చూస్తున్నామన్నారు. అవకాశం ఉన్నంత మేర ట్రైబ్యునల్ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని కేంద్రమంత్రి చెప్పారు. ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్న కేసీఆర్ ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారని నిలదీశారు కేంద్రమంత్రి షెకావత్. కేసీఆర్ చేస్తున్నది అంతా ఒక డ్రామా అని విమర్శించారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదించిన అంశాలపై ఇష్టారీతిన ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు కేంద్రమంత్రి షెకావత్. విద్యుత్ ప్రాజెక్ట్ ల నిర్వహణ విషయంలో ఎలాంటి గందరగోళం లేదన్న మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.. నోటిఫికేషన్ లో పూర్తి స్పష్టత ఉందన్నారు. ఇది ఇలావుండగా, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం నవంబర్ 15, 16 తేదీల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించనుంది. కేంద్ర జలశక్తి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమల్లో భాగంగా కేఆర్ బీఎంకి స్వాధీనం చేసేందుకు గుర్తించిన ఔట్ లెట్లను సబ్ కమిటీ పరిశీలించనుంది. గతంలో శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన ఔట్ లెట్లను పరిశీలించిన ఉపసంఘం.. తాజాగా నాగార్జున సాగర్ కు సంబంధించిన ఔట్ లెట్లను పరిశీలించనుంది.












Click it and Unblock the Notifications