ఎప్‌స్టీన్ ఫైల్స్: రాహుల్ గాంధీ ఆరోపణలకు కేంద్ర మంత్రి కౌంటర్!
వివాదాస్పద అమెరికన్ వ్యాపారవేత్త జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంబంధాలు ఉన్నాయంటూ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఘాటుగా స్పందించారు. ఎప్‌స్టీన్ ఫైల్స్‌కు సంబంధించి తనపై వచ్చిన వార్తలపై ఆయన పార్లమెంటు వెలువల క్లారిటీ ఇచ్చారు. రాహుల్ గాంధీకి ఆరోపిణలు చేయడం అలవాటుగా మారిందని.. ఆయన కామెంట్స్ కేవలం వినోదం కోసం మాత్రమేనని ఎద్దేవా చేశారు.
ఎప్‌స్టీన్‌తో భేటీ వెనుక అసలు నిజం
ఎప్‌స్టీన్‌ను తాను కలిసిన మాట వాస్తవమేనని.. అయితే అది పూర్తిగా అధికారిక, అంతర్జాతీయ ప్రతినిధి బృందంలో భాగంగా జరిగిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ వివరించారు. ఇది 2009లో జరిగింది. అప్పట్లో హర్దీప్ సింగ్ పూరీ న్యూయార్క్‌లో భారత రాయబారిగా ఉండేవారు. ఇంటర్నేషనల్ పీస్ ఇన్‌స్టిట్యూట్ (IPI) ప్రతినిధి బృందంలో సభ్యునిగా ఉన్నప్పుడు ఎప్‌స్టీన్‌తో 3-4 సార్లు భేటీ జరిగిందని ఆయన స్పష్టం చేశారు. అప్పట్లో ఆస్ట్రేలియా మాజీ ప్రధాని ఈ సంస్థకు నేతృత్వం వహించేవారని.. ఆయన ద్వారానే ఈ పరిచయం ఏర్పడిందని చెప్పారు.

"నవంబర్ 26, 2025న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ నన్ను కలిసి, మీ పేరు ఓ ఆసక్తికరమైన చోట (ఎప్‌స్టీన్ ఫైల్స్) వచ్చిందని కన్ను కొడుతూ చెప్పారు. అప్పుడే నేను ఆయనకు పూర్తి నిజాలు వివరిస్తూ నోట్స్ పంపాను. అయినా సరే పార్లమెంటులో మళ్లీ అదే అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు" అని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీపై తలపోటు వ్యాఖ్యలు
రాహుల్ గాంధీ పార్లమెంటులో తన ప్రసంగం ముగియగానే వెళ్లీపోతారని, ఇతరుల మాటలు వినే ఓపిక ఆయనకు లేదని పూరీ విమర్శించారు. బ్రెజిల్ మోడల్ ఓటు వేసిందన్న తప్పుడు ప్రచారం నుంచి, రాజ్యాంగం కాపీని గాలిలో ఊపడం వరకు రాహుల్ చేసే పనులన్నీ బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని మండిపడ్డారు.
భారత ఆర్థిక వ్యవస్థపై స్పందన
ఇండియాను 'డెడ్ ఎకానమీ' (మృత ఆర్థిక వ్యవస్థ) అని రాహుల్ గాంధీ పిలవడాన్ని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తప్పుబట్టారు. "ప్రపంచంలో 10వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను మేము 4వ స్థానానికి చేర్చాం. త్వరలో 3వ స్థానానికి వెళ్తున్నాం. డెడ్ ఎకానమీ అంటే ఏంటో ఆయన డిక్షనరీ చూసి తెలుసుకోవాలి" అని ఎద్దేవా చేశారు.
ట్రేడ్ అగ్రిమెంట్లపై క్లారిటీ
అంతర్జాతీయ ఒత్తిడితోనే భారత్ వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటోందన్న విమర్శలకు బదులిస్తూ.. "భారత జీడీపీలో 50 శాతం ఎక్స్‌టర్నల్ సెక్టార్‌తో ముడిపడి ఉంది. కొంచెం చదువుకోవాలి. మేము తక్కువ సమయంలో 9 వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేశాం" అని హర్దీప్ సింగ్ పూరీ వివరించారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications