Madhya Pradesh Polls: మధ్యప్రదేశ్ ను కుదిపేస్తున్న ఆ వీడియో? ఆత్మరక్షణలోకి బీజేపీ !
మధ్యప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. మాటల తూటాలు పేలుతున్నాయి. అదే సమయంలో ఓ వీడియో బయటపడింది. ఇందులో కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్ కుమారుడు దేవేంద్ర సింగ్ తోమర్ ఓ రూ.500 కోట్ల డీల్ మాట్లాడుతున్నట్లు కనిపించింది. అంతే కాంగ్రెస్, బీజేపీ మధ్య అప్పటివరకూ సాగిన మాటల యుద్ధం కాస్తా పతాకస్ధాయికి చేరిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ వీడియోపైనే చర్చ.
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కుమారుడు రూ.500 కోట్ల విలువైన డీల్ కుదుర్చుకున్నట్లు చూపించే వీడియో సోమవారం బయటకు రావడంతో మధ్యప్రదేశ్‌లో బీజేపీ డిఫెన్స్‌లో పడిపోయింది. ఈ నెలలో బయటపడిన రెండవ వీడియో ఇది. ఇందులో రూ.18 కోట్లు, రూ.21 కోట్లు, రూ. 100 కోట్ల విలువైన మూడు వేర్వేరు ఒప్పందాలను చర్చిస్తున్న దేవేంద్ర సింగ్ తోమర్ కనిపించారు. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తోంది.

దీనిపై కేంద్రమంత్రి నరేంద్ర తోమర్ ను ప్రశ్నిస్తే ఫేక్ చర్చలతో సమయం వృథా చేసుకోమని చెప్పి తోసిపుచ్చారు. బీజేపీ అధికారికంగా కూడా ఇది ఫేక్ వీడియో అంటూ తిరస్కరించింది. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం వదిలిపెట్టడం లేదు. అధికార బీజేపీ ఎన్నికల వేళ అవినీతిలో కూరుకుపోయిందంటూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. దీంతో ఆత్మరక్షణలో పడుతున్న బీజేపీ ఇప్పుడు పోలీసులకు కూడా దీనిపై ఫిర్యాదు చేసింది.
Another video of Devendra Tomar, son of @BJP4MP ,BJP MP and Union Minister Narendra Tomar, goes viral.
— Kerala Pradesh Congress Sevadal (@SevadalKL) November 13, 2023
This time the minister's son is seen making a deal worth Rs 500 crore.
Mr. Modi,
Entire Madhya Pradesh has to be swallowed ❓
pic.twitter.com/dttMQxNs6L
మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ ఈ వీడియోను ఫేక్ గా అభివర్ణించారు. ప్రతిపక్ష పార్టీ ఈ వారం పోలింగ్‌కు ముందు ఓటర్లను గందరగోళంలోకి నెట్టేందుకు ఈ క్లిప్‌లను విడుదల చేసిందని, వారు లేవనెత్తడానికి అసలు సమస్య లేదని ఆరోపించారు. దీనిపై ఫిర్యాదు చేశామని, వీడియోపై దర్యాప్తు కూడా జరుగుతోందన్నారు. పోలీసులు మాత్రం ఈ వీడియోపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications