Yogi Adityanath: యూపీ సీఎం యోగిపై గడ్కరీ ప్రశంసల వర్షం.. ఆదిత్యనాథ్‍ను కృష్ణుడిగా అభివర్ణన..
యూపీలో శాంతిభద్రతలు కాపాడుతూ యోగి ఆదిత్యనాథ్ కృష్ణుడిలా మారాడని కేంద్ర మంత్రి గడ్కరీ అన్నారు.
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కృష్ణుడిగా అభివర్ణించారు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. శాంతిభద్రతలకు సంబంధించి యోగి చాలా బాగా పని చేస్తున్నారని అన్నారు. సోమవారం గడ్కరీ గోరఖ్‌పూర్‌లో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) 18 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఉత్తరప్రదేశ్ త్వరలో అత్యంత సంపన్న రాష్ట్రంగా ఆవిర్భవించనుందని అన్నారు. యూపీకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు.

రామరాజ్యం
పేదరిక నిర్మూలన, ప్రజా సంక్షేమం కోసం రామరాజ్యం ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. సమాజానికి హాని కలిగించే దుష్ట ధోరణుల ప్రభావం, అన్యాయం, దౌర్జన్యాల ప్రభావం పెరిగినప్పుడల్లా.. ప్రజలను రక్షించేందుకు అవతారమెత్తాడని కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లుగానే ఉత్తరప్రదేశ్‌లో యోగి జీ వచ్చాడని చెప్పారు. సామాన్యులను రక్షించేందుకు దుష్టశక్తులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారని గుర్తు చేశారు.

అమెరికా తరహాలో
అమెరికా తరహాలో యూపీ రోడ్లను తయారు చేస్తామని గతంలో చేసిన ప్రకటనలను గుర్తు చేసిన కేంద్ర మంత్రి, 2014 తర్వాత ఉత్తరప్రదేశ్‌లో జాతీయ రహదారుల పొడవు రెండింతలు పెరిగిందని, 2024 చివరి నాటికి రూ. 5 లక్షల కోట్ల విలువైన రోడ్డు పనులు చేపడతామని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో పూర్తయిన, నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదించిన జాతీయ రహదారుల ప్రాజెక్టుల గురించి సవివరమైన సమాచారాన్ని మంత్రి వివరించారు.

గోరక్షనాథ్
బాబా గోరక్షనాథ్ ఈ పుణ్యభూమిలో శంకుస్థాపనలు ఉత్తరప్రదేశ్‌లో పెట్టుబడులను ప్రోత్సహిస్తాయన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. తాము అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో జాతీయ రహదారులను నిర్మించడం ద్వారా ఉత్తరప్రదేశ్ ను దేశంలోనే మొదటి స్థానంలో ఉంచుతామన్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications