జవదేకర్‌కు కరోనా... యోగి, యడియూరప్ప తర్వాత, టెస్ట్ చేయించుకోవాలని
కరోనా ఎవరినీ వదలడం లేదు. ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. సినీ నటుడు పవన్ కల్యాణ్‌కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ కూడా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే ధృవీకరించారు. ఈ మేరకు ట్విట్ చేశారు. గత రెండు, మూడు రోజుల్లో తనతో సన్నిహితంగా మెలిగిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
జవదేకర్‌కు 70 ఏళ్లు కాగా.. ప్రస్తుతం కేంద్ర సమాచార ప్రసారాలు, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు, భారీ పరిశ్రమలు, ప్రభుత్వ పరిశ్రమలు సహా పలు కీలక మంత్రిత్వ శాఖలను పర్యవేక్షిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆయన అత్యంత సన్నిహితులు. అందుకోసమే కీలక శాఖల బాధ్యతలను అప్పగించారు.

తనకు కొవిడ్-19 పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యిందని జవదేకర్ తెలిపారు. గత రెండు, మూడు రోజులుగా నన్ను కలిసిన వారంతా స్వచ్ఛందగా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. తాజాగా కరోనా బారిన పడిన రాజకీయ ప్రముఖుల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప తదితరులు ఉన్నారు.
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ భారీగా ఉంది. వైరస్ సోకినట్టు రెండు, మూడురోజుల వరకు తెలియడం లేదు. ఆ లోపు లంగ్స్ ఎఫెక్ట్ చూపుతున్నాయి. ఇమ్యూనిటీ పవర్ లేని కొందరు చనిపోతున్నారు. మరికొందరు ఎలా గోలా బయటపడేస్తున్నారు. కానీ సెకండ్ ఎఫెక్ట్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. చాపకింద నీరులా వైరస్ మాత్రం ప్రబలుతోంది.












Click it and Unblock the Notifications