టిక్ టాక్ కు థాంక్స్ చెప్పిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ..నిషేధం తర్వాత వీడియో వైరల్
భారత్-చైనా దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నవేళ గాల్వాన్ ఘర్షణ కొనసాగుతున్న తరుణంలో చైనాకు చెందిన 59 యాప్స్ పై నిషేధం విధించి కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇలా నిషేధించబడిన యాప్స్ లో టిక్ టాక్ కూడా ఉంది. అయితే కరోనా కట్టడి లో భాగంగా టిక్ టాక్ పీపీఈ కిట్లు, విరాళాలు అందించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ టిక్ టాక్ కు ధన్యవాదాలు చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కరోనా మహమ్మారిపై ఐక్యంగా పోరాడాలి అన్న ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుకు విశేషమైన స్పందన వచ్చిందని పేర్కొన్నారు. అంతేకాదు కరోనా కంట్రోల్ కోసం టిక్ టాక్ ఇచ్చిన విరాళాన్ని, పీపీఈ కిట్లను ఉద్దేశించి మాట్లాడిన స్మృతి ఇరానీ టిక్ టాక్ సీఈఓ నిఖిల్ గాంధీ కి ధన్యవాదాలు తెలిపారు. ఇక ఆ వీడియోని అందరికీ చేరేలా షేర్ చేయాలని కూడా స్మృతి ఇరానీ కోరారు.కోవిడ్ -19 కి వ్యతిరేకంగా పోరాటంలో ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలకు 4,00,000 వ్యక్తిగత రక్షణ పరికరాలు (పిపిఇ) సూట్లను విరాళంగా ఇచ్చినందుకు మంత్రి కృతజ్ఞతలు తెలుపుతున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది .

ప్రస్తుతం చైనా యాప్స్ పై విధించిన నిషేధంలో భాగంగా టిక్ టాక్ ను కూడా నిషేధించడంతో ఇప్పుడు స్మృతి ఇరానీ టిక్ టాక్ కు ధన్యవాదాలు చెబుతున్న వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ వీడియోపై ఇప్పటికే విమర్శలు వెల్లువగా మారిన వేళ ముందు ముందు మరెన్ని విమర్శలు రానున్నాయో మరి .
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!!












Click it and Unblock the Notifications