బీజేపీ అంటే కాంగ్రెస్‌కు భయం: నిర్మలా సీతారామన్
చెన్నయ్: భారతీయ జనతా పార్టీ అన్నా, కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పినా కాంగ్రెస్ పార్టీకి భయం పట్టకుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అభివృద్ది పనులు చెయ్యరు బీజేపీ చేస్తే సహించలేరని వ్యాఖ్యానించారు.
60 సంవత్సరాలు అధికారం అనుభవించిన కాంగ్రెస్ పార్టీ చెయ్యలేని పనులు బీజేపీ ఏడాదిన్నర కాలంలో చేసి చూపించిందని గుర్తు చేశారు. చెన్నయ్ లో శుక్రవారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
ప్రధాని నరేంద్ర మోదీ సాధించిన విజయాలను చూసిన కాంగ్రెస్ నేతలు ఏమి చెయ్యాలో అర్థం కాక కంగారుపడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్ డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న సాహసోపేతమైన నిర్ణయాలతో భారతదేశం ప్రగతి పథం వైపు పరుగులు తీస్తున్నదని అన్నారు.

విదేశాలలో సైతం భారతదేశ కీర్తి ఇనుమడించిందని, ఆర్థికంగా మరిన్ని ఫలితాలు సాధించేందుకు అనేక పథకాలను రూపొందిస్తున్నామని నిర్మలా సీతారామన్ వివరించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల దగ్గర బ్యాంకు అకౌంట్ లు తెరిపించామని అన్నారు.
అనేక పథకాల కింద సబ్సిడీ సొమ్మ నేరుగా ప్రజల ఖాతాలలోకి చేరే విదంగా ఏర్పాట్లు చేశామని ఇదే సందర్బంలో గుర్తు చేశారు. రూ. 12 ప్రీమియంతో పేదలకు భీమా సౌకర్యం కల్పించామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు.












Click it and Unblock the Notifications