ఫ్లాట్లు ఇప్పిస్తామని మోసం: యునిటెక్ ఎండీ సంజయ్ అరెస్ట్
హవాలా కేసులో రియల్‌ఎస్టేట్ కంపెనీ యునిటెక్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ చంద్రను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం తెల్లవారుజామున డిల్లీ ఎకనామిక్ ఆఫీసెస్ వింగ్ పోలీసులు సంజయ్,
న్యూఢిల్లీ: హవాలా కేసులో రియల్‌ఎస్టేట్ కంపెనీ యునిటెక్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ చంద్రను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం తెల్లవారుజామున డిల్లీ ఎకనామిక్ ఆఫీసెస్ వింగ్ పోలీసులు సంజయ్, అతడి సోదరుడు అజయ్ చంద్రను అరెస్టు చేశారు. శనివారం మధ్యాహ్నం వీరిని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.
గ్రేటర్ నోయిడాలోని రెసిడెన్షియల్ ప్రాజెక్టులో ఫ్లాట్లను ఇస్తామని చెప్పి తమను మోసం చేశారంటూ కొనుగోలుదారులు యునిటెక్ కంపెనీపై కేసు వేశారు. 2008 ఏప్రిల్ నాటికి తమకు ఇళ్లు కట్టిస్తామని చెప్పి తమ నుంచి డబ్బు వసూలు చేశారని కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పటివరకు తమకు ఫ్లాట్లు ఇవ్వలేదు సరికదా.. తమ డబ్బును కూడా తిరిగివ్వలేదని బాదితులు ఆరోపించారు. దీంతో యునిటెక్ యజమానులపై మనీలాండరింగ్ కేసు నమోదైంది.
ఈ మేరకు పోలీసులు శనివారం సంజయ్, అతడి సోదరుడిని అరెస్టు చేశారు. కాగా, కోర్టు జనవరిలోనే అతని జూడిషియల్ కస్టడీకి ఆదేశించింది. ఇది ఇలా ఉండగా, 2011లో 2జీ స్పెక్ట్రమ్ కేసులోనూ సంజయ్ అరెస్ట్ కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications