ఉనావ్ రేప్: ఎట్టకేలకు సీబీఐ అదుపులో బీజేపీ ఎమ్మెల్యే
Recommended Video

లక్నో: 17ఏళ్ల మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌ను సీబీఐ ఎట్టకేలకు అదుపులోకి తీసుకుంది. కేసు విచారణ సిట్ నుంచి సీబీఐ చేతిలోకి వెళ్లిన మరుసటిరోజే ఆయన అరెస్ట్ కావడం గమనార్హం.
గురువారం కుల్దీప్ సింగ్‌పై యూపీ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అత్యాచారం, కిడ్నాప్, క్రిమినల్ బెదిరింపుల కింద కేసులు పెట్టారు. కేసును సీబీఐకి అప్పగించిన సిట్.. కస్టడీలో చనిపోయిన బాధితురాలి తండ్రికి సంబంధించి ఓ వీడియోను కూడా సమర్పించారు. పోలీసుల సమక్షంలోనే ఎమ్మెల్యే కుల్దీప్ సోదరుడు అతుల్ తనపై దాడికి పాల్పడ్డాడని అందులో అతను వాపోయాడు.
కాగా, కేసు తీవ్రత పట్ల ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరితో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో మంగళవారం నాడు ఎమ్మెల్యే కుల్దీప్ సోదరుడు అతుల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

తప్పు పట్టిన హైకోర్టు:
గురువారం ఇదే కేసుపై అలహాబాద్ హైకోర్టు విచారణ జరపగా.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదన్న ప్రశ్నకు.. సరైన సాక్ష్యాధారాలు లేవని చెప్పడాన్ని కోర్టు తప్పుపట్టింది.
ఇంతకుముందు కేసులన్నింటిల్లోనూ సాక్ష్యాలు లేకుండా ఎవరిని అరెస్ట్ చేయలేదా? అని చీఫ్ జస్టిస్ బోంస్లే ప్రశ్నించారు. రాష్ట్రంలో లా&ఆర్డర్ సక్రమంగా లేదని గ్రహించారు.

బాధితురాలి వైపా? ప్రభుత్వం వైపా?:
గ్యాంగ్ రేప్‌కు గురైన బాధితురాలు న్యాయం కోసం గత ఆర్నేళ్లుగా ఎన్నిసార్లు, ఎంతమంది చుట్టూ తిరిగిందో న్యాయమూర్తి పరిశీలించారు.
కేసును నీరుగారుస్తున్నట్టు అర్థం చేసుకున్న ఆయన.. అడ్వకేట్ జనరల్ రాఘవేంద్ర సింగ్‌ను సైతం ఇదే ప్రశ్నించారు. 'నేను ప్రభుత్వం వైపు ఉండాలా? లేక బాధితురాలి వైపా?' అని ప్రశ్నించారు.

శుక్రవారం తీర్పు:
కేసును విచారించిన అలహాబాద్ హైకోర్టు తీర్పును శుక్రవారానికి రిజర్వ్‌లో ఉంచింది. అంతకుముందు రోజు విచారణలో ప్రధాన నిందితుడు ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌ని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించింది. దానికి సరైన ఆధారాలు లేవని, కేసును సీబీఐకి అప్పగించామని చెప్పిన సమాధానంతో కోర్టు సంతృప్తి చెందలేదు.

గ్యాంగ్ రేప్.., కస్టడీ డెత్
కేసు పూర్వ పరాలను పరిశీలిస్తే.. 17ఏళ్ల ఓ మైనర్ బాలికపై ఎమ్మెల్యే కుల్దీప్ అతని అనుచరులు, సోదరులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. బాధితురాలు సీఎం ఇంటి ఎదుట ఆత్మహత్యకు కూడా యత్నించారు.
అదే రోజు ఆమె తండ్రి పోలీసుల కస్టడీలో చనిపోవడం కేసు తీవ్రతను మరింత పెంచింది. కుల్దీప్ అనుచరులే తన తండ్రిని చంపేశారని ఆమె ఆరోపించారు. ఇంత జరుగుతున్నా.. ప్రభుత్వం పెద్దగా స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఎట్టకేలకు సిట్ విచారణతో ప్రారంభమై.. ఈ కేసు ఇప్పుడు సీబీఐకి బదిలీ అయింది.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications