ఉన్నావ్ రేప్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే దోషి.. తేల్చిన కోర్టు, 19న శిక్ష ఖరారు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ మహిళపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఢిల్లీ తీస్ హజారీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడి ఉన్న బీజేపీ బహిష్కృత నేత కులదీప్ సింగ్ సెంగార్‌ను కోర్టు దోషిగా తేల్చింది.

డిసెంబర్ 19న శిక్ష ఖరారు
ఆగస్టు 5 నుంచి రోజువారీ విచారణ చేపట్టారు న్యాయమూర్తి ధర్మేష్ శర్మ. డిసెంబర్ 19న కులదీప్‌కు తీస్ హజారీ కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. కాగా, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు లక్నో కోర్టు నుంచి ఢిల్లీ కోర్టుకు కేసు బదిలీ అయ్యింది. బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగార్‌పై ఆరోపణలు రావడంతో ఆ పార్టీ అధిష్టానం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఉన్నావో ఘటనపై జిల్లా న్యాయమూర్తి ధర్మేశ్ శర్మ తన ఛాంబర్‌లోనే (ఇన్ కెమెరా) విచారణ ముగించారు. సీబీఐ కూడా ఈ కేసుకు సంబంధించిన సాక్షాధారాలతో వాదన వినిపించింది. దీంతో ఆగస్టు 5 నుంచి కేసును ప్రతి రోజూ విచారణకు చేపట్టారు.

రెండేళ్ల క్రితం మైనర్‌పై జరిగిన దారుణం..
2017 సంవత్సరంలో బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగార్ ఆ మహిళను అపహరించి, ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడినట్లు విమర్శలు వచ్చాయి. ఆమె అపహరణకు గురైనప్పుడు మైనర్ బాలికగా ఉంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని బెంగర్‌మౌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సెంగార్ నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో సెంగార్‌ను ఈ ఏడాది ఆగస్టులో బీజేపీ నాయకత్వం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు
లైంగిక వేధింపుల నుంచి చిన్న పిల్లల సంరక్షణకు సంబంధించిన (పోక్సో) చట్టం ప్రకారం నిందితుడైన ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. తొలుత స్థానిక కోర్టు ఎమ్మెల్యేపై హత్య కేసును నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. తాజాగా ఈ కేసులో ఢిల్లీ తీస్ హజారీ కోర్టు తీర్పు వెలువరించింది. డిసెంబర్ 19న సెంగార్‌కు న్యాయస్థానం శిక్షను ఖరారు చేయనుంది.

బాధితురాలి ప్రాణం తీసేందుకు యత్నాలు..
కాగా జులై 28న బాధితురాలు తన బంధువులతో కారులో వెళ్తుండగా.. ఓ ట్రక్కు వారిని ఢీకొట్టింది. దీంతో బాధితురాలి ఇద్దరు మహిళా కుటుంబసభ్యులు మరణించారు. ఈ ప్రమాదానికి కారణం నిందితుడు కులదీప్ సింగేనని ఆరోపణలున్నాయి. విచారణకు హాజరయ్యేందుకు వెళుతుండగానే ఈ ప్రమాదం చోటు చోటు చేసుకోవడం గమనార్హం. అంతేగాక, బాధితురాలి తండ్రిపై అక్రమ ఆయుధాల కేసును కూడా పెట్టారు. 2018, ఏప్రిల్ 3న అతడ్ని అరెస్ట్ చేశారు. జుడీషియల్ కస్టడీలో ఉండగానే అతడు ఏప్రిల్ 9న మరణించాడు.

రక్షణ లేదంటూ ఢిల్లీలోనే బాధితురాలు..
బాధితురాలు, ఆమె తల్లి, ఆమె అంకుల్ ఈ కేసులో ప్రధాన సాక్షులుగా ఉన్నారు. ఎయిమ్స్ ఆస్పత్రిలో బాధితురాలి నుంచి వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది ప్రత్యేక కోర్టు. కారు ప్రమాదంలో గాయపడిన బాధితురాలిని లక్నో నుంచి హెలికాప్టర్‌లో ఎయిమ్స్‌కు తరలించారు. ఇక తాము తమ సొంత గ్రామంలో ఉంటే ప్రమాదకరమని భావించిన బాధితురాలు, ఆమె కుటుంబసభ్యులు ఢిల్లీలోనే అద్దె ఇంట్లో ఉంటున్నారు. కోర్టు ఆదేశాలతో బాధితురాలి కుటుంబానికి సీఆర్పీఎఫ్ భద్రత కల్పిస్తోంది. ఢిల్లీ మహిళా కమిషన్ వారికి సహాయ సహకారాలు అందిస్తోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications