యోగికి షాక్: గోరక్‌పూర్‌లో ఎస్పీ ఆధిక్యం, మీడియాపై బ్యాన్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: బీహార్, ఉత్తరప్రదేశ్ లోకసభ ఉప ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం ప్రారంభమైంది. ఈ రెండు రాష్ట్రాల్లోని మూడు లోకసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి.

బీహార్‌లోని జహనాబాద్ శానససభ నియోజకవర్గం ఉప ఎన్నికలో ఆర్జెడీ అభ్యర్థి విజయం సాధించారు. బీహార్‌లోని ఆరారియా లోకసభ ఎన్నికల్లో ఆర్జెడి విజయం సాధించింది. భుబువా శాసనసభ ఎన్నికల్లో ఆర్జెడీ అభ్యర్థి విజయం సాధించారు.

ఉత్తరప్రదేశ్‌లోని గోరక్ పూర్ స్థానంలో ఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ నిషాద్ బిజెపి అభ్యర్థిపై ఆరు వేల ఓట్లకు పైగా మెజారిటీతో ఉన్నారు. పుల్పూరులో ఎస్పీ అభ్యర్థి బిజెపి అభ్యర్థిపై 16 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని గోరక్‌పూర్ లోకసభ స్థానంలో, పుల్పూరులో ఎస్పీ ఆధిక్యంలో కొనసాగుతోంది. బీహార్‌లోని ఆరారియాలో బిజెపి అభ్యర్థిపై ఆర్జెడీ అభ్యర్థి ఆధిక్యంలోకి వచ్చారు. భబువా అసెంబ్లీ స్థానంలో బిజెపి అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు.

యోగి ఆదిత్యానాథ్‌కు పెట్టని కోటగా ఉంటూ వస్తున్న గోరక్‌పూర్ లోకసభ స్థానంలో ఎస్పీ అభ్యర్థి ఆధిక్యంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. బిజెపి అభ్యర్థి ఉపేంద్ర దత్ శుక్లపై ఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ నిషాద్ 1,500 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం. ఈ స్థితిలో ఓట్ల లెక్కింపు కేంద్రాల నుంచి మీడియా ప్రతినిధులు పంపించేశారు. 

ఉత్తరప్రదేశ్‌లోని గోరక్‌పూర్, ఫూల్పూర్ స్థానాలకు, బీహార్‌లోని ఆరారియ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ గోరక్‌పూర్ స్థానానికి, డిప్యూటీ సిఎం కేశవ ప్రసాద్ మౌర్య రాజీనామాలు చేయడంతో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.

ఈ రెండు స్థానాల ఉప ఎన్నికలు యోగి ఆదిత్యానాథ్‌కు పరీక్షనే. రాష్ట్రంలో ప్రత్యర్థులుగా ఉంటూ వచ్చిన బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పీ), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) దోస్తీకి కూడా ఇది పరీక్షలాంటిదే. ఉప ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఏకమయ్యాయి.

ఈ ఉప ఎన్నికలను యోగి ఆదిత్యానాథ్ వచ్చే సాధారణ ఎన్నికలకు రిహార్సల్‌గా భావిస్తున్నారు. రెండు స్థానాల్లో త్రిముఖ పోటీ నెలకొని ఉంది. బిజెి, ఎస్పీ, కాంగ్రెసు పార్టీల అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

రెండు స్థానాల్లోనూ ఎస్పీ అభ్యర్థులను మాయావతి నేతృత్వంలోని బిఎస్పీ బలపరిచింది. 2017 శాసనసభ ఎన్నికల్లో ఎస్పీతో కలిసి పోటీ చేసిన కాంగ్రెసు సొంతంగా అభ్యర్థులను నిలబెట్టింది. గోరక్‌పూర్ లోకసభ స్థానానికి యోగి ఆదిత్యానాథ్ ఐదు విడతలు ప్రాతినిధ్యం వహించారు. 2017 శాసనసభ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవిని చేపట్టడంతో లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

పుల్పూర్ స్థానానికి మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. అది కాంగ్రెసు సీటుగా పేరు పొందింది. అయితే తొలిసారి 2014 ఎన్నికల్లో బిజెపి కైవసం చేసుకుంది. ఆ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన కేశవ్ ప్రసాద్ మౌర్య విజయం సాధించారు.

బీహార్‌లో ఆరారియా లోకసభ స్థానానికి, జెహనాబా్, బబువా అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. బిజెపి - జనతాదళ్ (యునైటెడ్) కూటమికి వ్యతిరేకంగా రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జెడీ), కాంగ్రెసు కూటమి తన అభ్యర్థులను పోటీకి దింపింది. నిరుడు మహా కూటమి నుంచి బయటకు వచ్చి బిజెపితో జత కట్టిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు ఈ ఉప ఎన్నికల ఫలితాలు పెద్ద పరీక్షనే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Counting of votes for bypolls to three Lok Sabha seats -- Phulpur and Gorakpur in Uttar Pradesh and Araria in Bihar -- began at 8 am on Wednesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి