యోగి ఆదిత్యానాథ్ ఎఫెక్ట్: మాంసం వ్యాపారానికి గుడ్ బై: టీ దుకాణాలు !

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అక్రమ కబేళాలపై కొరడా ఝుళిపించడంతో అక్కడి వ్యాపారుల్లో మార్పు వచ్చింది. ఇక అక్రమ కబేళాల వ్యాపారం చెయ్యలేమని తెలుసుకుని మాంసం దుకాణాలు మూసివేస్తున్నారు.

యూపీలో దారుణం: యోగి జిందాబాద్: నడిరోడ్డులో కాల్చి చంపిన ఎస్పీ నేత

ముజఫర్ నగర్ లో కొందరు వ్యాపారులు గతంలో నిర్వహించిన మాంసం దుకాణాలు మూసివేసి టీ అంగడి పెట్టుకుంటున్నారు. ఇప్పటికే కొందరు గతంలో ఉన్న మాంసం దుకాణాల స్థానంలో టీ దుకాణాలు పెట్టుకున్నారు.

ఉత్తరప్రదేశ్ లో అక్రమ కబేళాలపై ప్రభుత్వం కోరడా ఝుళిపించింది. శనివారం నుంచి మాంసం వ్యాపారులు నిరవధిక ఆందోళనకు దిగారు. అక్రమ కబేళాలు మూసివేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

కర్ణాటకకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్: అందుకే !

అయితే ఓ పక్క ఆందోళన జరుగుతున్న సమయంలోనే మరో పక్క వ్యాపారాలు వారి జీవనోపాధి కోసం వేరే వ్యాపారం చెయ్యడానికి సిద్దం అయ్యారు. ఇప్పటికే ముజఫర్ నగర్ లో దిల్ షాద్, నజాఖత్, బాష తదితరులు అక్రమ మాంసం దుకాణాలు మూసివేసి టీ వ్యాపారం మొదలుపెట్టారు.

కుటుంబ పోషణకోసం మరో దారిలేక టీ వ్యాపారం చెయ్యడానికి సిద్దం అయ్యామని వీరు మీడియాకు చెప్పారు. ఇదే దారిలో ఉత్తరప్రదేశ్ లో ఇప్పటి వరకు మాంసం వ్యాపారం చేస్తున్న వారు వేరే వ్యాపారాలు చెయ్యాలని మాంసం వ్యాపారాలు ఆలోచిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Uttar Pradesh chief minister Yogi Adityanath effect, three meat sellers in Muzaffarnagar turn to tea business.
Please Wait while comments are loading...