Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Yogi Adityanath: అతిక్-అష్రాఫ్ కాల్చివేతపై తొలిసారి నోరు విప్పిన యూపీ సీఎం

న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్, సమాజ్‌వాది పార్టీ లోక్‌సభ మాజీ సభ్యుడు అతిక్ అహ్మద్‌, ఆయన సోదరుడు అష్రాఫ్ అహ్మద్‌ దారుణ హత్య అనంతరం కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టులకు భద్రత కల్పించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. జర్నలిస్టులమని చెప్పుకొన్న ముగ్గురు వ్యక్తులు అతి సమీపం నుంచి వారిద్దరిపై కాల్పులు జరిపడమే దీనికి ప్రధాన కారణం. ఈ కాల్పుల్లో అతిక్ అహ్మద్, అష్రాఫ్ అహ్మద్ అక్కడికక్కడే మరణించారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఇటీవలే అతిక్ అహ్మద్ కుమారుడిని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. అతని అంత్యక్రియలు ముగిసిన వేళ- అతిక్ అహ్మద్, అష్రాఫ్ అహ్మద్‌పై కాల్పులు చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఘటనతో ప్రయాగ్ రాజ్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారిద్దరినీ మెడికల్ చెకప్ కోసం ఆసుపత్రికి తరలిస్తోన్న సమయంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు ఈ కాల్పులకు తెగబడ్డారు.

Yogi Adityanath made key remars on Atiq-Ashraf shoot

ఆసుపత్రి ఆవరణలో.. అతిక్ అహ్మద్ తలపై గన్ గురి పెట్టి మరీ కాల్చి చంపారు. అతిక్-అష్రాఫ్ అహ్మద్‌లను కాల్చిచంపిన కేసులో లవ్‌లేష్ తివారీ, సన్నీ సింగ్, అరుణ్ మౌర్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారు విచారణలో ఉన్నారు. ఈ ముగ్గురు కూడా తమను తాము జర్నలిస్టులుగా చెప్పుకొని, అతిక్ సోదారుల సమీపానికి వచ్చారు. ప్రెస్ కార్డులను మెడలో ధరించి.. వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఈ హత్యోదంతంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. బహిరంగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ జంట హత్యలపై ఆయన స్పందించడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఘటనను సమర్థించుకునేలా వ్యాఖ్యానించారాయన. మాఫియాను లేకుండా చేస్తోన్నామని, ఈ క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు.

ఇకపై ఉత్తరప్రదేశ్‌లో మాఫియా అనే వాళ్లెవరూ ఎవ్వరినీ బెదిరించబోరని యోగి ఆదిత్యనాథ్ తేల్చి చెప్పారు. అండర్ వరల్డ్ మాఫియా గానీ, గ్యాంగ్‌స్టర్లు గానీ సమాజంలో ఏ ఒక్కరినీ ఇకపై బెదిరించలేరని పేర్కొన్నారు. అలాంటి శాంతియుత వాతావరణాన్ని కల్పించడమే తన ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు. పారిశ్రామికవేత్తలు మొదలుకుని సాధారణ ప్రజానీకం వరకూ ఎవ్వరికీ మాఫియా, గ్యాంగ్‌స్టర్ల భయం ఉండబోదని హామీ ఇచ్చారు.

తమ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దడానికి శాయశక్తులా కృషి చేస్తోన్నామని యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆరు సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా మత కల్లోలాలు, దాడులు-ప్రతిదాడుల వంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని గుర్తు చేశారు. ఈ ఆరు సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా తన ప్రభుత్వం కర్ఫ్యూను విధించలేదని చెప్పారు.

గతంలో ఉత్తరప్రదేశ్ అంటే దాడులు-ప్రతిదాడులకు మారుపేరుగా ఉండేదని, ఇప్పుడా పరిస్థితులు లేవని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో ఉత్తర ప్రదేశ్ ఇప్పుడు శాంతియుత పరిస్థితులకు చిరునామాగా మారిందని, ఈ క్రమంలోనే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలి వస్తోన్నాయని అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్ని వసతులను కల్పిస్తోన్నామని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+