ఫిర్యాదు కోసం స్టేషన్‌కు తల్లీకూతుళ్లు.. వాళ్లను చూస్తూ ఎస్ఐ హస్తప్రయోగం.. రూ.25వేల రివార్డు..

దేశమంతా ఫ్రెండ్లీ పోలీసింగ్ వైపు అడుగులు వేస్తున్న తరుణంలో ఓ ఖాకీచకుడి వికృతం సంచలనంగా మారింది. తను జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు ఓ తల్లి.. తన టీనేజ్ కూతురిని వెంటపెట్టుకుని పోలీస్ స్టేషన్ కు రాగా.. వాళ్లతో మాట్లాడుతూనే హస్తప్రయోగానికి పాల్పడ్డాడా అధికారి. ఈ అకృత్యానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అతనిపై చర్యలకు ఉన్నతాధికారులు ఆదేశించారు. కానీ అప్పటికే ఆ ఎస్ఐ అజ్ఞాతంలోకి జారుకున్నాడు. అతణ్ని పట్టించిన వారికి రూ.25 వేల రివార్డు ఇస్తామని జిల్లా ఎస్పీ ప్రకటించారు.

అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్ లోని దేవరియా జిల్లా భట్నీ పోలీస్ స్టేషన్ లో ఎస్‌హెచ్‌వోగా విధులు నిర్వహిస్తోన్న భీష్మపాల్ సింగ్ తీరు తొలి నుంచీ వివాదాస్పదమే. భూ వివాదానికి సంబంధించి భట్నీకే చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. ఫిర్యాదు వింటున్నట్లుగా నటిస్తూ.. ఆమె ముందే ఎస్ఐ అకృత్యానికి పాల్పడేవాడు. స్టేషన్ కు వెళ్లిన ప్రతిసారి సింగ్ అదే పని చేస్తుండటంతో భరించలేక ఆమె చివరికి వీడియో తీసింది..

అది విన్నాక షాక్..

అది విన్నాక షాక్..

‘‘నేను గమనిస్తున్నానని గుర్తించినా ఆ ఎస్ఐ తన పని ఆపేవాడుకాదు. మన సమాజంలో మహిళలకు ఇలాంటి ఘోరమైన అనుభవాలు తప్పవు కదా అని సర్దుకుపోదామనుకున్నాను. కానీ మా ఏరియాలో ఉండే మరో మహిళతోనూ ఎస్ఐ ఇలానే ప్రవర్తించాడని విన్న తర్వాత అతణ్ని వదలకూడదని నిర్ణయించుకున్నాను. ప్రజల్ని కాపాడాల్సిన పోలీసులే ఫిర్యాదు చేయడానికొచ్చేవాళ్ల పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తే ఇక మహిళలకు దిక్కేది? కనీసం ఇంకో ఆడబిడ్డకైనా ఇలాంటిది జరగొద్దనే వీడియో తీశాను.. '' అని బాధితురాలు మీడియాకు చెప్పారు.

కూతురితో కలిసి వీడియో..

కూతురితో కలిసి వీడియో..

కొంతకాలంగా ఎస్ఐ భీష్మ చర్యల్ని ఓపికపట్టిన బాధిత మహిళ.. గత నెల 22న తన టీనేజ్ కూతురిని వెంటబెట్టుకుని భట్నీ స్టేషన్ కు వెళ్లింది. ఆమెతో మాట్లాడుతూ ఎస్ఐ చేస్తోన్న పనిని కూతురు రహస్యంగా వీడియో తీసింది. ఆ తర్వాత పెద్ద ఊరి పెద్ద మనుషులకు ఆ వీడియోను చూపించారు. ఎస్ఐ భీష్మ పాల్ గురించి అంతకుముందే ఎన్నో విని ఉన్న గ్రామస్తులు.. స్టేషన్ ను చుట్టుముట్టి న్యాయం కోసం నినదించారు. బాధితురాలి బంధువైన ఓ యువకుడు ఎస్ఐ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరలైంది. అన్ని ప్రముఖ చానెళ్లు, పత్రికల్లో కీచక పోలీస్ వార్తలు ప్రసారం అయ్యాయి. దీంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు..

Recommended Video

    Bizarre Incident: సరదా కోసం మెంతి కూర అని చెప్పి గంజాయి ఇచ్చాడు, తర్వాత ఏమైందంటే ? | Oneindia Telugu
    ఎస్ఐ కోసం పోలీసుల వేట..

    ఎస్ఐ కోసం పోలీసుల వేట..

    భట్నీ ఎస్ఐ భీష్మపాల్ సింగ్ పోలీస్ స్టేషన్ లో అలాంటి చర్యకు పాల్పడటాన్ని ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖ ఖండించింది. దేవరియా జిల్లా ఎస్పీ శ్రీపతి మిశ్రా మీడియా ముఖంగా బాధితురాలికి క్షమాపణలు చెప్పారు. అంతేకాదు, ఎస్ఐపై సస్పెన్షన్ వేటువేసినట్లు ప్రకటించారు. అయితే, మీడియాలో తన వీడియోలు ప్రసారం అవుతున్నాయని తెలిసిన వెంటనే భీష్మపాల్అజ్ఞాతంలోకి జారుకున్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారని ఎస్పీ మిశ్రా చెప్పారు. తప్పుచేసి తప్పించుకుని తిరుగుతున్న ఎస్ఐ తలపై రూ.25వేల రివార్డును ప్రకటించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+