UP Crime: అప్పు చేసి మరీ మరదలిపై సామూహిక అత్యాచారం, హత్య.. యూపీలో సంచలన కేసు
UP Crime: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ లో హృదయ విదారక ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన మరదలిని హత్య చేసేందుకు రూ.40వేల అప్పుడు తీసుకున్నాడు. తర్వాత మరదలిని సామూహిక అత్యాచారం చేసి హత్య చేసేందుకు ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్లను కూడా నియమించుకున్నాడు. ఆపై ఆమెను గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితుడిని ఆశిష్ గా గుర్తించారు.
సమాచారం ప్రకారం, ఈ ఘటన జనవరి 21న మీరట్‌లోని నాను కెనాల్ సమీపంలో జరిగింది. నిందితుడు తన 21 ఏళ్ల మరదలిని హత్య చేయడానికి కుట్ర పన్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడు తన మరదలితో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని, దాని కారణంగా ఆమె తనను తరచుగా బ్లాక్ మెయిల్ చేసేదని విచారణలో తేలింది. ఈ కారణంగా ఆమె హత్యకు ఆశిష్ కుట్ర పన్నాడు. ఈ క్రమంలోనే ఆశిష్ శుభం అనే యువకుడిని సంప్రదించాడు.శుభం అతనికి దీపక్ అనే వ్యక్తిని పరిచయం చేయగా.. అతను హత్య చేయడానికి అంగీకరించాడు.

పోలీసుల కథనం ప్రకారం.. ముగ్గురూ కలిసి హత్యకు ప్లాన్ చేశారు. దీని కోసం ఒప్పందం రూ. 30,000కు జరిగింది. నిందితుడు రూ.40 వేలు అప్పు తీసుకుని ముందస్తుగా రూ.10 వేలు ఇచ్చి, హత్య తర్వాత మిగిలిన రూ.20 వేలు ఇస్తానని ఒప్పందం కుదిరింది. అనంతరం జనవరి 21న ఆశిష్, శుభం, దీపక్ లు బాధిత మహిళను స్కూటర్ పై కాలువ వద్దకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారం ఆపై స్కార్ఫ్ తో గొంతు నులిమి చంపేశారు. ఆపై మృతదేహంపై పెట్రోల్ పోసి దహనం చేశారు.
బాధితురాలు కనిపించడం లేదని ఆమె కుటుంబం జనవరి 23న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు లో చివరిసారిగా ఆమె తన బావ ఆశిష్, శుభం, దీపక్ లతో కనిపించిందని తెలిసింది. ఆ ఆధారాలతో పోలీసులు మృతురాలి బావను అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరాన్ని అంగీకరించాడు. దర్యాప్తు సమయంలో ఫోరెన్సిక్ బృందం కొన్ని కీలక ఆధారాలను సేకరించింది. ఘటనాస్థలం నుంచి కాలిన బట్టలు, బాధితురాలి ఉంగరం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటన గురించి పోలీసులు ఏం చెప్పారంటే..
జనవరి 23న 21 ఏళ్ల మహిళ కనిపించడం లేదని ఫిర్యాదు అందిందని రూరల్ ఎస్పీ ఆదిత్య బన్సల్ తెలిపారు. దర్యాప్తు సమయంలో ఆమె తన బావ, అతని ఇద్దరి స్నేహితులు శుభం, దీపక్ లతో కనిపించిందని తేలిందని చెప్పారు. ఈ ముగ్గురు ఏదో తప్పు చేశారని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారని చెప్పారు.
ఈ సమాచారం ఆధారంగా వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడంతో మొత్తం కథ వెలుగులోకి వచ్చిందన్నారు. నిందితుడు తన మరదలితో 2 సంవత్సరాలుగా అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని తేలిందన్నారు. ఆమె దగ్గర కొన్ని అశ్లీల ఫోటోలు, వీడియోలు ఉన్నాయని.. ఆ వీడియోలతో బాధితురాలు నిందితుడిని బ్లాక్ మెయిల్ చేసి ఉండొచ్చని ఎస్పీ వెల్లడించారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications