వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్మార్ట్ ఫోన్, స్కూటీ: యువతకు ప్రియాంక వరాలు

|
Google Oneindia TeluguNews

వచ్చే ఏడాది యూపీకి ఎన్నికల జరగనున్నాయి. ఎన్నికల్లో గెలవాలని బీజేపీ, కాంగ్రెస్ అనుకుంటున్నాయి. అందుకు సంబంధించి వ్యుహా రచన చేసి ముందడుగు వేస్తున్నాయి. ఎలాగైనా విజ‌యం సాధించి పార్టీకి పున‌ర్వైభ‌వం తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. రాష్ట్రంలో మ‌హిళ‌ల ఓట్లు ఎవ‌రికైతే ప‌డ‌తాయో వారు విజ‌యం సాధించే అవ‌కాశం ఉంటుందని అంచనా వేసింది. ఈ మేరకు మహిళలకు హామీలు గుప్పిస్తోంది.

మ‌హిళా ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునే దిశ‌గా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 40 శాతం సీట్ల‌ను మ‌హిళ‌ల‌కు కేటాయిస్తామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. మ‌రికొన్ని వ‌రాల‌ను ప్ర‌క‌టించింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ విజ‌యం సాధిస్తే ఇంట‌ర్‌లో ఉత్తీర్ణులైన బాలిక‌ల‌కు స్మార్ట్ ఫోన్లు అందిస్తామ‌ని బంపర్ ఆఫర్ ఇచ్చింది. గ్రాడ్యుయేష‌న్ చేస్తోన్న యువ‌తుల‌కు ఉచితంగా స్కూటీ ఇస్తామ‌ని కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ ప్ర‌క‌టించారు. తామేమి ఊరికే మాట‌లు చెప్ప‌డం లేద‌ని, పార్టీ మ్యానిఫెస్టో ఆమోదం మేర‌కు తాము ఈ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తున్నామ‌ని ఆమె తెలిపారు.

UP election 2022: Priyanka Gandhi promises smartphones, scooty for girls

Recommended Video

Telangana : Congress-BJP రెండూ ఒకటే.. మీడియా తో KTR చిట్ చాట్!!

విద్యార్థునుల భ‌ద్ర‌త తమకు ముఖ్య‌మ‌ని అందుకు స్మార్ట్‌ఫోన్లు అందించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ప్రియాంక గాంధీ తెలిపారు. ఈ విష‌యాల‌ను ప్రియాంక గాంధీ ట్విట్ట‌ర్ ద్వారా తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఆఫర్ యువతను ఆకట్టుకునే అవకాశం ఉంది. యువతకు కావాల్సింది స్మార్ట్ ఫోన్.. బైక్.. అలాంటి కీలకమైన రెండు అందిస్తామని చెప్పి ఓట్లు రాలేలా చేస్తోంది. మరీ యూత్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారో.. యోగికి మద్దతు చెబుతారో చూడాల్సి ఉంది.

English summary
Congress leader Priyanka Gandhi on Thursday announced that all Class 12 girls in Uttar Pradesh will be given a smartphone and all graduate girls will be given an electric scooter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X