వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేడ చల్లి, ఇటుక విసిరి: బీజేపీ ఎమ్మెల్యేపై ఆర్ఎల్డీ మద్దతుదారుల దాడి..

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరుగుతుంది. అయితే క్యాంపెయిన్ ముగిసన సమయంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. భాగ్ పట్ జిల్లా చాప్రౌలిలో బీజేపీ ఎమ్మెల్యే సహేందర్ సింగ్‌ రోడ్ షో నిర్వహించారు. అయితే అతనికి చేదు అనుభవం ఎదురయ్యింది. ప్రచారం చేసే సమయంలో కొందరు అనుచితంగా ప్రవర్తించారు. వారు ఆర్ఎల్డీ మద్దతుదారులు అని పోలీసులు భావిస్తున్నారు. కాన్వాయ్‌లోని వాహనాలపై ఇటుకలతో దాడి చేశారు. అలాగే పేడ విసిరి కలకలం రేపారు. దీంతో బీజేపీ, ఆర్ఎల్డీ మద్దతుదారుల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

యూపీ తొలి విడతలో తొలి విడత బరిలో 623 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2.27 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. దోబ్ ప్రాంతంలో బీజేపీకి మంచి పట్టు ఉంది. 2017లో 58 సీట్లలో 53 చోట్ల విజయం సాధించింది. ఎస్పీ, బీఎస్పీ రెండు సీట్లను గెలుచుకున్నాయి. 20 నియోజకవర్గాల్లో మైనార్టీ, బీసీలు ప్రభావం చూపించాయి. ఆగ్రా, అలీఘడ్‌లో గల 16 సీట్లలో జాట్లు ప్రభావం చూపనున్నారు. 2012లో మాత్కం ఎస్పీ ఆర్ఎల్డీ 19 సీట్లు గెలుచుకుని తమ హవాను చాటింది.

UP Election 2022: RLD supporters allegedly attack BJP MLA, his convoy in Baghpats Chhaprauli

తొలివిడతలో మొత్తం 11 జిల్లాల్లో గల 58 నియోజకవర్గాల ఓటింగ్ జరగనుంది. షామ్లీ, ముజప్ఫర్ నగర్, మీరఠ్, బాగ్‌పట్, ఘజియాబాద్, హాపుర్, గౌతమ్ బుద్ధ నగర్, బులంద్‌షహర్, అలీగఢ్, మథుర, ఆగ్రా జిల్లాల్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నిక జరుగుతుంది. యూపీలో మొత్తం 7 విడతలో పోలింగ్ జరగనుంది. మార్చి 10వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడుతారు. ఆ రోజు ఎవరూ రాజు తెలియనుంది. యూపీలో విజయం సాధిస్తే.. దేశంలో అధికారం చేపట్టడం ఖాయం అని బలంగా నమ్ముతారు. ఎందుకంటే ఇక్కడ 80 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి.

English summary
MLA and BJP candidate Sahender Singh attacked while campaining. dung was thrown at him. The vehicles involved in the convoy were attacked with bricks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X