వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధ్యాహ్నం అఖిలేష్ రిజైన్, రాహుల్‌తో పొత్తువల్లే.. ములాయం వర్గం ఫైర్

యూపీలో ఘోర పరాజయం నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గవర్నర్‌కు రాజీనామా పత్రం సమర్పించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన గవర్నర్‌ను కలుస్తారు. ఓటమిని ఎస్పీ అంగీకరించింది.

|
Google Oneindia TeluguNews

లక్నో: యూపీలో ఘోర పరాజయం నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గవర్నర్‌కు రాజీనామా పత్రం సమర్పించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన గవర్నర్‌ను కలుస్తారు. అఖిలేష్ గవర్నర్ అపాయింటుమెంట్ తీసుకున్నారు. ఓటమిని ఎస్పీ అంగీకరించింది. బీజేపీ అంచనాలను మించి సీట్లు సాధిస్తున్న విషయం తెలిసిందే.

ములాయం వర్గం ఆగ్రహం

యూపీ ఎన్నికలకు ముందు తండ్రి ములాయం సింగ్ యాదవ్, కొడుకు అఖిలేష్ యాదవ్ మధ్య విభేదాలు కనిపించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీతో పొత్తుతో పాటు కుటుంబ విబేదాల ప్రభావం ఎన్నికల్లో కనిపించింది.

<strong>యూపీలో గెలుపు!: రాజ్యసభ సహా.. బీజేపీకి లాభాలివే, అతిపెద్ద విక్టరీ</strong>యూపీలో గెలుపు!: రాజ్యసభ సహా.. బీజేపీకి లాభాలివే, అతిపెద్ద విక్టరీ

UP Election Result 2017: Akhilesh Yadav resignation

అఖిలేష్ వర్గం ములాయం వర్గాన్ని పక్కన పెట్టి ముందుకెళ్లిందని, అందుకే ఈ ఫలితం అని ములాయం సింగ్ వర్గం మండిపడుతోంది. అఖిలేష్ ఒంటెత్తు పోకడలు దెబ్బతీశాయని అగ్రహిస్తున్నారు. మమ్మల్ని రాహుల్ గాంధీయే దెబ్బతీశారని, అసలు ఆయనతో అఖిలేష్ ఎందుకు పొత్తు పెట్టుకున్నారని ఎస్పీ నేత మదుకర్ ప్రశ్నించారు.

కాగా, యూపీ ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోతుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను నిజం చేస్తూ యూపీ ఓటర్లు బీజేపీకే మొగ్గు చూపినట్లు స్పష్టంగా కనిపిస్తుండటంతో పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఆనందం తొణికిసలాడుతోంది. దీంతో లక్నో బీజేపీ శ్రేణులు నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

English summary
'Rahul Gandhi dragged us down. Why did Alkhilesh Yadav ally with him?' says, SP leader Madhukar Jetley, SP
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X