వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

1977 తర్వాత.. 300 రికార్డ్: కింగ్ మేకర్ 'యూపీలో ఇదీ 'పెద్దల' లెక్క

ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఏకంగా 303 స్థానాలకు పైగా కమలం పార్టీ గెలుచుకుంటోంది. 1977 తర్వాత ఇన్ని స్థానాలు గెలవడం ఇదే ప్రథమం కావడం గమనార్హం. ఇది బీజేపీకి కొత్త ఉత్సాహం.

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఏకంగా 303 స్థానాలకు పైగా కమలం పార్టీ గెలుచుకుంటోంది. 1977 తర్వాత ఇన్ని స్థానాలు గెలవడం ఇదే ప్రథమం కావడం గమనార్హం. ఇది బీజేపీకి కొత్త ఉత్సాహం. 2014 అద్భుత విజయం తర్వాత ఈ రికార్డ్ ఆ పార్టీకి చరిత్ర.

జాతీయ రాజకీయాల్లో ఉత్తర ప్రదేశ్ చాలా కీలకం. దేశానికి యూపీ కింగ్ మేకర్. 2014 ఎన్నికల్లో మోడీ ప్రధాని అయ్యారంటే దానికి యూపీనే కారణం. 80 లోకసభ స్థానాలకు గాను ఏకంగా 73 సీట్లు గెలుచుకున్నారు. దీంతో మోడీ పీఎం పీఠంపై కూర్చున్నారు.

<strong>యూపీలో గెలుపు!: రాజ్యసభ సహా.. బీజేపీకి లాభాలివే, అతిపెద్ద విక్టరీ</strong>యూపీలో గెలుపు!: రాజ్యసభ సహా.. బీజేపీకి లాభాలివే, అతిపెద్ద విక్టరీ

యూపీలో చారిత్రాత్మక గెలుపు బీజేపీ కొత్త ఉత్సాహం ఇవ్వడంతో పాటు రాజ్యసభలో బలం పెంచుకునేందుకు కూడా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం బీజేపీకి 53 మంది ఎంపీలు ఎగువ సభలో ఉన్నారు.

UP Election Result 2017: With big Uttar Pradesh win, BJP is stronger in Rajya Sabha

యూపీలో గెలుపు ద్వారా మరిన్ని రాజ్యసభ స్థానాలు పెంచుకునే అవకాశం ఏర్పడింది. లోకసభలో బీజేపీ హవా కనిపిస్తున్నా.. రాజ్యసభలో సభ్యులు తక్కువగా ఉండటం వల్ల పలు సమయాల్లో ఇరుకున పడుతోంది. యూపీ గెలుపుతో రాజ్యసభలో బీజేపీ బలం కూడా పెరగనుంది.

<strong>అక్కడే తప్పు: అఖిలేష్‌ను నిండా ముంచిన రాహుల్ గాంధీ!</strong>అక్కడే తప్పు: అఖిలేష్‌ను నిండా ముంచిన రాహుల్ గాంధీ!

యూపీలో ప్రస్తుతం 31 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఏ రాష్ట్రం నుంచి కూడా ఇంతమంది ఎగువ సభ సభ్యులు లేరు.

31 మందిలో సమాజ్ వాది పార్టీ తరఫున 18 మంది, బీఎస్పీ తరఫున 6గురు, ఒకరు స్వతంత్ర్య అభ్యర్థి, ముగ్గురు బీజేపీ, ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు.

ఇప్పుడు 300 స్థానాల్లో బీజేపీ గెలవడం ద్వారా బీజేపీ రాజ్యసభ సభ్యులను పెంచుకునే అవకాశం ఏర్పడింది. ప్రతి రాజ్యసభ సభ్యుడు గెలిచేందుకు 34 ఓట్లు కావాలి.

ప్రస్తుత బలం చూస్తుంటే బీజేపీ సులభంగా ఎనిమిది నుంచి 9 స్థానాలు గెలుచుకుంటుంది. మిగిలిన సభ్యులు, ఇతరులతో కలిసి మరో స్థానాన్ని కూడా దక్కించుకునే అవకాశాలు లేకపోలేదు. కాంగ్రెస్, ఎస్పీ కలిసి కూడా కేవలం 3 స్థానాలు గెలుచుకుంటుంది. బీఎస్పీ ఇతరుల మద్దతు లేకుండా ఒక్క సీటు కూడా గెలుచుకునే పరిస్థితులు లేవు.

English summary
It is for a reason that Uttar Pradesh is often referred to as the kingmaker state in the country. The massive victory in the Uttar Pradesh assembly polls has just given the BJP more power in the Rajya Sabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X