అదృశ్య శక్తులు: యూపీ ఘన విజయం వెనుక ఆ ముగ్గురు బ్యాచిలర్స్

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయానికి కారణం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అని అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఈ భారీ విజయం వెనుక ఓ వ్యక్తి అదృశ్య శక్తిగా పనిచేశారు. ఆ అద

లక్నో: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయానికి కారణం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అని అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఈ భారీ విజయం వెనుక ఓ వ్యక్తి అదృశ్య శక్తిగా పనిచేశారు. ఆ అదృశ్య శక్తే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచారక్ సునీల్ బన్సల్.

తెర వెనుక వ్యూహాలు..

తెర వెనుక వ్యూహాలు..

తెరవెనుక ఉంటూనే వ్యూహ రచనలు చేస్తూ పార్టీ విజయంలో కీలకపాత్ర పోషించిన అపర చాణక్యుడిగా వ్యూహాలను అమలుపర్చాడు. కింది స్థాయి నుంచి పార్టీ పటిష్టతకు కృషి చేసి, ఓటర్ల నాడిని పట్టి, బీజేపీకి ఓట్లు కురిపించేలా చేశారు సునీల్ బన్సల్. అంతేగాక, ఆయనతోపాటు మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఆయనకు సహాయకంగా గెలుపులో కీలక పాత్ర పోషించారు.

ప్రణాళికలు ఖచ్ఛితంగా అమలు..

ప్రణాళికలు ఖచ్ఛితంగా అమలు..

తన ప్రణాళికలను ఖచ్చితంగా అమలు చేసి పార్టీ గెలుపు కోసం కృషి చేసేందుకు ఈయనను అమిత్ షా ఏరికోరి రాజస్థాన్‌ నుంచి రప్పించుకున్నారు. రాజకీయంగా పెద్దగా పరపతి లేకపోయినా వ్యూహాలు రచించడం, అమలు చేయటంలో బన్సల్‌ దిట్ట.

అఖండ విజయం ఇలా..

అఖండ విజయం ఇలా..

2014 సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో బీజేపీకి అత్యధిక సీట్లు దక్కడంలో ప్రధాన భూమిక పోషించిన ఆయన ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అమిత్ షా ప్రణాళికలను అనుకున్నది అనుకున్నట్లు విజయవంతంగా అమలు చేశారు. తద్వారా 15 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీకి అఖండ విజయాన్ని అందించారు.

కనీవినీ ఎరుగని ఆధిక్యం

కనీవినీ ఎరుగని ఆధిక్యం

కులాలకు ప్రాధాన్యమిచ్చే రాష్ట్రంలో సీట్ల పంపిణీ అంటే మాటలు కాదు. అలాంటిది అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా కమలం పార్టీకి కనీవినీ ఎరుగని ఆధిక్యాన్ని సాధించిపెట్టారు.

మరో ఇద్దరు కూడా

మరో ఇద్దరు కూడా

సునీల్ బన్సల్ బీజేపీకి అపూర్వ విజయానికి ఎంత కృషి చేశారో.. ఆయనతోపాటు మరో ఇద్దరు కూడా కీలక భూమికను పోషించారు. వారే ఆర్ఎస్ఎస్ ప్రచారక్ శివ్ ప్రకాశ్, మాజీ ప్రచారక్ ఓంప్రకాశ్ మాథూర్, వీరిద్దరూ కూడా క్షేత్రస్థాయిలో పార్టీకి అనూహ్యంగా ఓట్లను పెంచే కృషి చేశారు. సునీల్ బన్సల్ సహా వీరు ముగ్గురు అవివాహితులు కావడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+