UP Elections 2022: మూడో విడతలో 135మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు, కోటీశ్వరుల మధ్య పోటీ

ఉత్తరప్రదేశ్లో దశలవారీగా ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీగా ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. అధికారం కోసం బీజేపీ, బీజేపీ ని గద్దె దించడం కోసం ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే శుక్రవారంతో ఉత్తర ప్రదేశ్ మూడో విడత ఎన్నికల ప్రచారం ముగియనుంది.

 యూపీ మూడో విడతలో 135 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు

యూపీ మూడో విడతలో 135 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మూడో విడతలో పోటీలో ఉన్న 135 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని కొత్త విశ్లేషణ నివేదిక వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ వాచ్ అండ్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) విడుదల చేసిన విశ్లేషణ ప్రకారం అక్కడ వారు ఫిబ్రవరి 20 న జరిగే తదుపరి దశ యూపీ ఎన్నికలలో పోటీ చేస్తున్న 627 మంది అభ్యర్థులలో 623 మంది అభ్యర్థుల స్వీయ ప్రమాణ పత్రాలను విశ్లేషించారు.

ఏడీఆర్ విశ్లేషణ ప్రకారం పార్టీల వారిగా క్రిమినల్ కేసులు ఉన్నవారి జాబితా

ఏడీఆర్ విశ్లేషణ ప్రకారం పార్టీల వారిగా క్రిమినల్ కేసులు ఉన్నవారి జాబితా

ప్రధాన పార్టీలలో, సమాజ్ వాదీ పార్టీ నుండి 58 మంది అభ్యర్థులలో 30 మంది, భారతీయ జనతా పార్టీ (బిజెపి) నుండి 55 మంది అభ్యర్థులలో 25 మంది, బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) నుండి 59 మంది అభ్యర్థులలో 23 మంది, 56 మంది అభ్యర్థులలో 20 మంది కాంగ్రెస్ నుండి అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని విశ్లేషించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నుండి విశ్లేషించబడిన 49 మంది అభ్యర్థులలో 11 మంది తమ అఫిడవిట్లలో తమపై క్రిమినల్ కేసులను ప్రకటించారు.

 59 నియోజకవర్గాల్లో 26 నియోజకవర్గాలలో రెడ్ అలర్ట్

59 నియోజకవర్గాల్లో 26 నియోజకవర్గాలలో రెడ్ అలర్ట్

ఎస్పీకి చెందిన 21 మంది, బీజేపీకి చెందిన 20 మంది, బీఎస్పీకి చెందిన 18 మంది, కాంగ్రెస్‌కు చెందిన 10 మంది, ఆప్‌కు చెందిన 11 మంది అభ్యర్థులు తమపై కూడా తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్ లో నమోదు చేసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే నేరగాళ్ల సంఖ్య ఆధారంగా ఈ దశలోని 59 నియోజకవర్గాల్లో 26 నియోజకవర్గాలను రెడ్ అలర్ట్ నియోజకవర్గాలుగా ప్రకటించారు.

 మూడో దశలో 245 మంది కోటీశ్వరులు పోటీ

మూడో దశలో 245 మంది కోటీశ్వరులు పోటీ

ఇదిలా ఉంటే మూడో దశలో 245 మంది కోటీశ్వరులు పోటీ చేస్తున్నారు. 623 మంది అభ్యర్థుల్లో 245 మంది (సుమారు 39%) అభ్యర్థులు కోటీశ్వరులేనని విశ్లేషణ నివేదిక పేర్కొంది. ప్రధాన పార్టీల్లో ఎస్పీకి చెందిన 52, బీజేపీకి 48, బీఎస్పీకి 46, కాంగ్రెస్ నుంచి 29, ఆప్ నుంచి 18 మంది అభ్యర్థులు కోటి రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు.అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీకి చెందిన అత్యంత సంపన్న అభ్యర్థి యశ్‌పాల్ సింగ్ యాదవ్ మొత్తం ఆస్తుల విలువ రూ.70 కోట్లు గా పేర్కొన్నట్టు విశ్లేషణ వెల్లడించింది.

 మూడో దశలో తలపడనున్న కోటీశ్వరులు

మూడో దశలో తలపడనున్న కోటీశ్వరులు

ఏడీఆర్ విశ్లేషించిన 58 మంది సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థుల్లో 52 మంది (90 శాతం) కోటీశ్వరులే. ఏ డి ఆర్ అఫిడవిట్‌లను విశ్లేషించిన 55 మంది బిజెపి అభ్యర్థులలో 48 (87 శాతం) మంది కోటీశ్వరులు. 59 బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులలో 46 (78 శాతం) మంది కోటీశ్వరులు. కాంగ్రెస్‌లో, 56 మంది అభ్యర్థులలో 29 (52 శాతం) మంది కోటీశ్వరులు. ఉత్తరప్రదేశ్‌లో 2022 అసెంబ్లీ ఎన్నికల మూడవ దశలో రెండవ మరియు మూడవ అత్యంత సంపన్న అభ్యర్థులు కాంగ్రెస్‌కు చెందినవారు. కాన్పూర్ నగర్‌లోని కిద్వాయ్ నగర్ నియోజకవర్గానికి చెందిన అజయ్ కపూర్ 69 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను ప్రకటించారు. జిల్లాలోని ఆర్యనగర్ నియోజకవర్గానికి చెందిన ప్రమోద్‌కుమార్‌కు రూ.45 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. ఏ డి ఆర్ ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ నుండి 37 శాతం మంది అభ్యర్థులు కోటి రూపాయలకు పైగా ఆస్తులను ప్రకటించారు.

 యూపీలో ఫిబ్రవరి 20న మూడో దశ పోలింగ్

యూపీలో ఫిబ్రవరి 20న మూడో దశ పోలింగ్

మూడో దశ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి సగటు ఆస్తులు రూ.2.82 కోట్లు అని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌లో ఫిబ్రవరి 20న మూడో దశ ఎన్నికలు జరగనుండగా.. మరో నాలుగు దశలు ఫిబ్రవరి 23, ఫిబ్రవరి 27, మార్చి 3, మార్చి 7 తేదీల్లో జరగనున్నాయి. పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్‌లతో పాటు ఓట్ల లెక్కింపు మార్చి 10న జరగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+