యూపీని అభివృద్ధి చేయకే ప్రతిపక్షాలకు ఆ గతి; ౩౦౦సీట్లకు పైగా బీజేపీవే: డిప్యూటీసీఎం కేశవ్ మౌర్య
సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీల కారణంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జబ్బు పడిన రాష్ట్రంగా మారిందని , కానీ నేడు భారతీయ జనతా పార్టీ యూపీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తోందని ఉప ముఖ్యమంత్రి కేశవ్ మౌర్య వెల్లడించారు .ఈసారి బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుందనే విషయంపై మౌర్య మాట్లాడుతూ, ఈసారి కూడా కాషాయ పార్టీ 300 సీట్లకు పైగా గెలుస్తుందని అన్నారు.

అభివృద్ధి చేయనందుకే ప్రతిపక్షాలకు ఆ గతి
సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిని ఓడించి అధికారంలోకి రావాలని ఆయన పేర్కొన్నారు. వారి దారులన్నీ మూసుకుపోయాయని, వారిని ప్రజలు ఆదరించారని ఉప ముఖ్యమంత్రి కేశవ్ మౌర్య స్పష్టం చేశారు. అభివృద్ధి చేయనందుకే ప్రతిపక్షాలకు ఆ గతి పట్టిందని, ఉత్తరప్రదేశ్ అభివృద్ధి విషయంలో బీజేపీ తన వంతు కృషి చేసిందన్నారు. బిజెపి హయాంలో రోడ్ల నిర్మాణం జరిగిందని కానీ వారి కాలంలో మొత్తం గుంతల మయం గా ఉందని వ్యాఖ్యానించారు.

గతంలో శాంతిభద్రతలకు విఘాతం.. ఇప్పుడు గూండాలపై ఉక్కుపాదం
గతానికి ఇప్పటికీ చాలా తేడా ఉందని పేర్కొన్న డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్య గతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగింది అన్నారు. ఇప్పుడు బిజెపి హయాంలో గూండాలను అరెస్టు చేస్తున్నారని, ఉక్కుపాదం మోపుతున్నామని కేశవ మౌర్య పేర్కొన్నారు.కోవిడ్ ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసింది . ఎన్నికల సంఘం భౌతిక ర్యాలీలను నిషేధించడం మరియు వర్చువల్ ర్యాలీలను నిర్వహించాలని పార్టీలను కోరడంతో ఇది రాజకీయ పార్టీలకు సమస్యగా మారింది.

మళ్ళీ యూపీలో అధికారంలో బీజేపీనే
దీనిపై మౌర్య మాట్లాడుతూ.. భౌతిక ర్యాలీలు కొనసాగనప్పటికీ బూత్ స్థాయిలో పార్టీ తీవ్రంగా పని చేస్తుందని వెల్లడించారు.పార్టీ శ్రేణుల సహాయంతో, ప్రజల ఆశీర్వాదంతో బిజెపి విధానాల వల్ల మళ్లీ ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి వస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. రైతుల ఆదాయాన్ని పెంచామని, యువతకు అవినీతి రహిత ఉపాధి కల్పించామని, ప్రజలకు లక్షలాది ఉద్యోగాలు కల్పించామని ఉప ముఖ్యమంత్రి కేశవ్ మౌర్య పేర్కొన్నారు.

యూపీలో రసవత్తర ఎన్నికల పోరు
ఉత్తరప్రదేశ్లో ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య ఎన్నికల నేపథ్యంలో మాటల తూటాలు పేలుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో మళ్లీ బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుంటే, బిజెపికి చెక్ పెట్టడానికి ప్రతిపక్ష పార్టీలు విఫలయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ లు బిజెపిని టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రచార నిర్వహిస్తున్నాయి. ఇదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బిజెపి పై విరుచుకు పడుతోంది.












Click it and Unblock the Notifications