UP Elections 2022: అక్కడ స్మశానాలకు వెళ్లి ఓట్లు అడగండి: ఎస్పీ, బీఎస్పీలపై యోగి ఆదిత్యనాథ్ ఘాటువ్యాఖ్యలు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి), బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు వారిని ఆదరించబోరు అని తేల్చి చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలోని మొహమ్మదీలో ఎన్నికల ర్యాలీలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు.

Recommended Video

    Uttar Pradesh Elections 2022:PM Modi చరిష్మా గట్టెక్కించేనా ? | Yogi Adityanath | Oneindia Telugu

    ఎస్పీ, బీఎస్పీలు స్మశానాలకు వెళ్లి ఓట్లు అడగాలి : యోగి ఆదిత్యనాథ్

    ఎస్పీ, బీఎస్పీలు స్మశానాలకు వెళ్లి ఓట్లు అడగాలి : యోగి ఆదిత్యనాథ్

    ఈ సందర్భంగా ఆయన యూపీలోని ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. సమాజ్‌వాదీ పార్టీ మరియు బహుజన్ సమాజ్ పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. కేవలం వారు స్మశాన వాటికలకు సరిహద్దు గోడలను నిర్మించారని , కాబట్టి వారు అక్కడికి వెళ్లి ఓట్లు అడగాలి అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

    బీజేపీ చేసిన అభివృద్ధిని గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధిని పోల్చి చెప్పిన యోగి

    బీజేపీ చేసిన అభివృద్ధిని గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధిని పోల్చి చెప్పిన యోగి

    అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను గతంలో ఎస్పీ హయాంలోని అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పోల్చి చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ వృద్ధులకు మరియు వృద్ధులకు పెన్షన్ పథకాన్ని మూసివేసింది, కానీ మా ప్రభుత్వం వృద్ధులకు రూ. 12,000 పెన్షన్ ఇస్తోంది అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. 'సబ్కా సాథ్ సబ్‌కా వికాస్‌' లక్ష్యంతో బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి ప్రధానలక్ష్యంగా పనిచేస్తోందని యోగి ఆదిత్యనాథ్‌ తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను ఉద్దేశించి పేర్కొన్నారు

     ఉత్తరప్రదేశ్‌లోని ప్రజలందరికీ సమానంగా సంక్షేమం అందించాం

    ఉత్తరప్రదేశ్‌లోని ప్రజలందరికీ సమానంగా సంక్షేమం అందించాం

    బిజెపి హయాంలో అందించిన ప్రభుత్వ పథకాలపై ప్రజల అభిప్రాయాన్ని డిగిన యోగి ఆదిత్యనాథ్ కోవిడ్-19 కాలంలో 2 సార్లు రేషన్ ఇచ్చారా లేదా అని ప్రశ్నించారు. రేషన్ పంపిణీలో ఎటువంటి వివక్షత ఉండకూడదని తమ ప్రభుత్వం చెప్పిందని, అందరికీ రేషన్ అందని పేర్కొన్నారు. ఇదే సమయంలో విద్యుత్ సరఫరాలో కూడా ఎటువంటి అవాంతరాలు లేకుండా విద్యుత్తు అందించామని, సంక్షేమ పథకాల అమలులో అన్ని మతాల వారు సమానమేనని ఆయన పేర్కొన్నారు.

    డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మాది .. అధికారంలోకి వస్తే మహిళలకు బస్సు ప్రయాణం ఫ్రీ

    డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మాది .. అధికారంలోకి వస్తే మహిళలకు బస్సు ప్రయాణం ఫ్రీ

    ఉత్తరప్రదేశ్‌లోని 25 కోట్ల జనాభాను ఒక కుటుంబంగా భావించి అందరికీ సమానంగా సంక్షేమాన్ని అందిస్తున్నామని, ప్రజల దుఃఖ, సంతోష సమయాల్లో వారికి అండగా ఉండడం మా కర్తవ్యంగా భావిస్తున్నాం అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.మా డబుల్ ఇంజన్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే 60 ఏళ్లు పైబడిన మహిళలందరికీ రాష్ట్ర కార్పొరేషన్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తామని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని ,గుండాలతో, కుటుంబ పాలన సాగించేవారితో సాధ్యం కాదని పేర్కొన్నారు.

     యూపీలో ఏడు దశల్లో పోలింగ్ .. మూడు దశల పోలింగ్ పూర్తి

    యూపీలో ఏడు దశల్లో పోలింగ్ .. మూడు దశల పోలింగ్ పూర్తి

    ఉత్తరప్రదేశ్‌లో ఏడు దశల అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10న ప్రారంభమయ్యాయి. మొదటి మూడు దశల ఎన్నికలు పూర్తయ్యాయి. తదుపరి దశలు ఫిబ్రవరి 23, 27, మార్చి 3 మరియు మార్చి 7 తేదీల్లో జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది. యూపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం కొనసాగుతుంది. ఒకరిని మించి ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+