యూపీ పోల్స్: సీఎం యోగి ఆదిత్యనాథ్ వేషధారణలో పోలింగ్ కేంద్రానికి ఓటరు(వీడియో)

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. గురువారం సాయంత్రం ఐదు గంటల వరకు 50 శాతానికిపైగా ఓటింగ్ శాతం నమోదైంది. నోయిడాలోని ఓ వ్యక్తి గురువారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వేషధారణలో ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌కు చేరుకున్నాడు. వైరల్‌గా మారిన వీడియోలో, రాజు కోహ్లి అనే వ్యక్తి, నోయిడా సెక్టార్ 11లోని ఒక పోలింగ్ స్టేషన్‌కు కాషాయ వేషధారణతో వస్తున్నట్లు చూడవచ్చు.

Recommended Video

    UP Elections 2022 : 'UP To Become Kashmir, Kerala & Bengal' - Yogi Adityanath | Oneindia Telugu

    నోయిడా సెక్టార్-11 ఓటరు అయిన రాజు కోహ్లి పోలింగ్ స్టేషన్‌కు వెళుతుండగా.. రాబోయే ఎన్నికల్లో తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఎన్నికల పోరులో ఉన్న యూపీ సీఎంతో ఆయన పోలికను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బట్టతల, కుంకుమ చోళతో యోగి ఆదిత్యనాథ్ అద్దంలా కనిపిస్తున్న రాజు వైపు అందరి చూపు మళ్లింది.

    UP Elections 2022: Noida Voter Dresses Like CM Yogi Adityanath To Cast Vote.

    మరో చమత్కారమైన పోల్ సంఘటన విషయానికొస్తే.. పశ్చిమ యూపీలోని ముజఫర్‌నగర్‌కు చెందిన వరుడు తన వివాహానికి కొన్ని గంటల ముందు ఓటు వేయడానికి వచ్చాడు. ఎందుకు పెళ్లి దుస్తులు ధరించారని అడిగినప్పుడు, అతను పెళ్లికొడుకు అని, పెళ్లి ఊరేగింపులో చేరడానికి ముందు తన ఓటు వేయాలని కోరుకున్నట్లు తెలిసింది.

    బలరామ్ తన హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నట్లు పిటిఐ నివేదించింది. ఓటు వేసిన తరువాత, అతని ఇంటి నుంచి లోని ప్రాంతానికి అతని వివాహ ఊరేగింపు బయలుదేరింది. కాగా, యూపీలో మొత్తం ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గురువారం తొలి దశ ఎన్నికలు జరుగుతున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+