UP Elections 2022: ఆరో విడతలో క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థుల లెక్క ఇదే!!

ఉత్తరప్రదేశ్లో దశలవారీగా ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అధికారం కోసం బీజేపీ, బీజేపీని గద్దె దించడం కోసం ప్రతిపక్షాలు పడరాని పాట్లు పడుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీగా ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది.యూపీలో ఎన్నికల ప్రచారంలో మాటల దాడులకు దిగుతున్నాయి.

ఉత్తరప్రదేశ్లో గురువారం ఆరో విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ కు సంబంధించి అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఏడో విడత ఎన్నికలకు సంబంధించి అధికార ప్రతిపక్ష పార్టీల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్లో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల అఫిడవిట్లను పరిశీలించి వారిపై ఉన్న క్రిమినల్ కేసులను, వారి ఆస్తుల వివరాలను అధ్యయనం చేసిన ఏడీఆర్ ఆరవ విడత ఎన్నికలలో బరిలో ఉన్న అభ్యర్థుల నేర చరితుల డేటా వెలువరించింది.

UP Elections: Criminal cases against candidates contesting 27 percent in sixth phase

మొత్తం 182 మంది అభ్యర్థుల్లో 123 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయని విశ్లేషణ పేర్కొంది. క్రిమినల్ కేసులున్న 40 మంది అభ్యర్థులను ఎస్పీ రంగంలోకి దింపిందని వెల్లడించింది. ఏడీఆర్ నివేదిక ప్రకారం, ఆరవ దశ ఎన్నికలలో 38శాతం కోటీశ్వరులు ఉన్నారు. కోట్ల విలువైన ఆస్తులు మరియు నేర నేపథ్యం దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలలో అభ్యర్థిత్వానికి ప్రధాన ఎంపిక ప్రమాణాలుగా ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) డేటా విశ్లేషణ చూపిస్తుంది.

యుపి అసెంబ్లీ ఎన్నికల ఒకటవ విడత నుండి నేరచరితుల సరళి మారలేదు. ఏడీఆర్ విశ్లేషణ ప్రకారం, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఆరవ విడత కోసం బరిలో ఉన్న మొత్తం అభ్యర్థులలో నలుగురిలో ఒకరికి నేర నేపథ్యం ఉన్నట్లు తెలుస్తుంది. అభ్యర్థుల్లో 27 శాతం మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. ఈ దశలో 182 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 182 మంది అభ్యర్థుల్లో 123 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో ప్రధానంగా గరిష్టంగా 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష విధించే నేరాలు మరియు నాన్ బెయిలబుల్ నేరాలు ఉన్నాయని విశ్లేషణ పేర్కొంది. క్రిమినల్ కేసులున్న 40 మంది అభ్యర్థులను సమాజ్‌వాదీ పార్టీ బరిలోకి దింపిందని ఏడీఆర్ విశ్లేషణ వెల్లడించింది. ఆ తర్వాత 23 మంది అభ్యర్థులతో అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఉంది. మరో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌లో కూడా 22 శాతం మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నట్లు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+