యూపీలో దారుణం-కొడుకుని చంపాడని బెయిల్ పై బయటికి తెచ్చి మరీ చంపిన తండ్రి
2021లో యూపీలోని బరేలీలో జితేంద్ర అనే బాలుడు అదృశ్యమయ్యాడు. కొన్ని రోజుల తర్వాత స్ధానికంగా ఉన్న ఓ నది ఒడ్డున పోలీసులకు కప్పిపెట్టిన మృతదేహం లభించింది. దీంతో తొలుత నీటిలో మునిగి చనిపోయాడని భావించి పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదు. ఆ తర్వాత ఓ దశలో పోలీసులకు అనుమానం వచ్చి కేసు నమోదు చేశారు. విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆ తర్వాత మరో హత్య కూడా జరిగింది.
మైనర్ బాలుడు జితేంద్రను అతని తల్లి, సమీప బంధువయ్యే లాలా అనే వ్యక్తితో కలిసి చంపేసింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య వచ్చిన విభేదాలతో ఆమె పోలీసుల్ని ఆశ్రయించి లాలాపై కేసు పెట్టించింది. విచారణ జరిపిన పోలీసులు ఆమె భర్త కాశీని కుడా విచారించారు. చివరకు ఆయన పాత్ర లేదని తేలడంతో వీరిద్దరినీ జైలుకు పంపారు. అయితే జైల్లో ఉన్న సమయంలో తన కుమారుడిని చంపిన లాలాను హతమార్చాలని కాశీ భావించాడు.

బాలుడి తండ్రి కాశీ.. జైల్లో ఉన్న హంతకుడు లాలాను బెయిల్ పై బయటికి తీసుకురావాలని భావించాడు. ఇందుకోసం ఓ లాయర్ ను కూడా మాట్లాడాడు. అతనికి ఫీజు చెల్లించి బెయిల్ తీసుకురావాలని అభ్యర్ధించాడు. చివరికి ఆ లాయర్ ఎంతో కష్టపడి హంతకుడు లాలాను బెయిల్ పై బయటికి తీసుకొచ్చాడు. ఇదే అదనుగా బాలుడి తండ్రి కాశీ.. హంతకుడు లాలాను అతి సమీపం నుంచి గన్ తో కాల్చిచంపాడు.
బాలుడిని తన భార్యతో కలిసి చంపేసిన లాలాపై కక్షపెంచుకున్న తండ్రి కాశీ.. అతని కదలికల్ని గమనించి, జైలు నుంచి బెయిల్ పై బయటికి తెప్పించి మరీ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో కాశీని సైతం అరెస్టు చేసి జైలుకు తరలించారు. తన కుమారుడిని చంపేశాడనే కక్షతోనే కాశీ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications