క్లోనింగ్‌తొ నకిలీ ఆధార్‌కార్డుల తయారీ, 10మంది అరెస్ట్

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: నకిలీ ఆధార్ కార్డులు తయారుచేస్తున్న పదిమంది సభ్యుల ముఠాను ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు.ఆధార్ కార్డు ధరఖాస్తు ఫారాన్ని ముద్రించడం కోసం సెక్యూరిటీ సోర్స్‌కోడ్‌ను హ్యక్ చేశారు నిందితులు. అంతేకాదు ఆధార్ కార్డును మంజూరు చేసే అధికారుల వేలిముద్రలను కూడ క్లోనింగ్ చేసినట్టుగా అధికారులు గుర్తించారు.

ఆధికారుల వేలిముద్రలను క్లోనింగ్ చేసేందుకు గెలాటిన్ జెల్, లేజర్ సిలికాన్‌లను ఉపయోగించారు. సంక్షేమ పథకాలకు ఆధార్‌తో అనుసంధానం చేయాలని ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

UP Gang Found Complex Way To Make Fake Aadhaar Cards, Say Police

దీంతో నకిలీ ఆధార్‌కార్డులను తయారుచేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. నోడల్ అథారిటీ యూఐడిఏ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లకు జారీచేసిన లాగిన్ వివరాలను కూడ హ్యకర్లు సేకరించారని పోలీసు ఉన్నతాధికారి త్రివేణిసింగ్ చెప్పారు.

ధరఖాస్తుదారుల ప్రతిని క్లోనింగ్ చేసి వేలిముద్రలను అక్రమ కార్యకలాపాల కోసం ఐదువేల రూపాయాల చొప్పున విక్రయిస్తున్నారని త్రివేణిసింగ్ చెప్పారు.

ఈ వ్యవహరంలో యూఐడిఏఐ అధికారుల హస్తం ఉందని అనుమానాలను త్రివేణిసింగ్ వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఎందరి ఆధార్ వివరాలను ప్రాసెస్ చేశారనే విషయమై లోతుగా పరిశీలిస్తున్నట్టు చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The police in Uttar Pradesh arrested 10 men on Sunday who they said are members of a gang that was involved in counterfeiting Aadhaar cards, hailed for their bulletproof biometric features at the centre of the government's push for reforms in welfare, taxation and communications.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X