యూపి నుండి ఎత్తుకెళ్లి, నేపాల్లో 20 రోజులు గ్యాంగ్‌రేప్
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. అరాచకాల ఉత్తరప్రదేశ్‌లోని ఇటవాకు చెందిన విజయపాల్ అతని అల్లుడు చింకులు పదహారేళ్ల బాలికను జూన్ 1వ తేదీన కిడ్నాప్ చేశారు. ఆమెను అక్కడి నుండి నేపాల్‌కు తీసుకు పోయారు.
అక్కడ వారు ఇరవై రోజుల పాటు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను నేపాల్లో అమ్మేసేందుకు ప్రయత్నించారు. అయితే బాధిత బాలిక వారి వద్ద నుండి తప్పించుకుంది. పోలీసులను సంప్రదించింది. వారు ఆమెను స్వస్థలానికి పంపించారు.

అక్కడి పోలీసుల సమాచారంతో కేసు నమోదు చేసినట్లు యూపీ పోలీసులు చెప్పారు. పోలీసులు విజయపాల్, చింకులను అరెస్టు చేశారు. బాలికను అమ్మే ప్రయత్నానికి చింకూ తండ్రి సహకరించాడు. అతను పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. కొనేందుకు ప్రయత్నించిన వ్యక్తి కోసం కూడా గాలిస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications