గూడ్స్‌ను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు: 40 మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. సంత్ కబీర్ నగర్‌లో ఈ ప్రమాదం సంభవించింది. ఢిల్లీ నుంచి గోరఖ్‌పూర్ వెళుతున్న గోరఖ్‌ధామ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పి గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో నాలుగు భోగీలు పట్టాలు తప్పాయి. దీంతో 40 వరకు మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరో వంద మందికి పైగా గాయపడ్డారు.. గాయపడ్డ వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం విషయం తెలియగానే రైల్వే అధికారులు సంఘటన స్థలంకు చేరుకున్నారు. ఘటన జరిగిన ప్రాంతం ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోకు 230 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

విద్యుదాఘాతంతో ఆరుగురి మృతి
షార్ట్ సర్య్కూట్ కారణంగా ఆగ్రాలోని బసల్ గుజర్ గ్రామంలో ఒకే కుటుంబంలోని ఆరుగురు ఆదివారం అగ్నికి ఆహుతయ్యారు. వీరిలో ముగ్గురు పిల్లలు ఉన్నారు.
హీరాలాల్ (26) తన భార్య బబిత (23), తల్లి రాంబేటి (50)తో కలిసి ఉంటున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కాజల్ (1), జతిన్(3). బబిత సోదరుడి కూతురు రేణు(14) కూడా వీరితో పాటే ఉంటోంది. సుడిగాలి వల్ల హైటెన్షన్ వైర్లు ఒకదానికొకటి రాసుకుని అగ్గి మిరుగులు చెలరేగి వీరు ఉంటున్న నివాసంపై పడ్డాయి.
క్షణాల్లో మంటలు ఇల్లంతా వ్యాపించాయి. స్థానికులు మంటలను ఆర్పడానికి ప్రయత్నించినప్పటికీ విఫలమై పోలీసులకు సమాచారం అందించారు. ఒక సైనిక దళం అక్కడికి చేరుకున్నప్పటికీ మంటలు పూర్తిగా ఆర్పివేయడానికి అర్ధరాత్రి పట్టింది.












Click it and Unblock the Notifications