మసీదు నిర్మాణంకు భూమి కేటాయించిన యోగీ సర్కార్.. మళ్లీ సుప్రీంకు బాబ్రీ లిటిగెంట్లు
లక్నో: అయోధ్యలో మసీదు నిర్మాణంకు ఐదెకరాల స్థలం కేటాయించాలని రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్మును ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం స్థలం కేటాయించింది. అయితే ఇది అయోధ్యకు 25 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో సరికొత్త వివాదం తెరపైకొచ్చింది. దీంతో మరోసారి సుప్రీంకోర్టు తలపు తట్టేందుకు సున్నీ వక్ఫ్ బోర్డు సిద్దమైంది.
Recommended Video

అయోధ్యకు 25 కిలోమీటర్ల దూరంలో స్థలం కేటాయింపు
మసీదు నిర్మాణం కోసం యూపీ ప్రభుత్వం బుధవారం ఐదెకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్ సమావేశంలో నిర్ణయించింది. అయితే ఇది అయోధ్యలో కాకుండా ధన్నీపూర్ గ్రామంలో ఈ భూమిని కేటాయించింది. శ్రీరాముడి ఆలయం కోసం ట్రస్టును ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఈ ఐదెకరాల భూమిని యోగీ సర్కార్ కేటాయించడం విశేషం. ధన్నీపూర్ గ్రామం అయోధ్య జిల్లాలోని సోహావాల్ మండలంలో ఉంది. లక్నో - గోరఖ్‌పూర్ హైవేకు 200 మీటర్ల దూరంలో మాత్రమే మసీదుకు కేటాయించిన భూమి ఉండటం విశేషం.

భూ కేటాయింపుపై కీలక మీటింగ్ నిర్వహించనున్న సున్నీ బోర్డు
ఇదిలా ఉంటే మసీదు నిర్మాణంకు కేటాయించిన భూమి అయోధ్య పట్టణం నుంచి చాలా దూరం ఉందని దీన్ని వెంటనే పునఃసమీక్షించాలని ప్రభుత్వాన్ని కోరింది. లేదంటూ మళ్లీ సుప్రీంకోర్టు తలపులను తడుతామని వక్ఫ్ బోర్డు ప్రతినిధులు చెప్పారు. ఇక ఈ నెల 24న సున్నీ వక్ఫ్ బోర్డు కీలక సమావేశానికి పిలుపు నిచ్చింది. ధన్నీపూర్ గ్రామంలో జరిపిన భూకేటాయింపులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రస్తుతం కేటాయించిన స్థలం అయోధ్య నుంచి చాలా దూరంలో ఉందని నమాజ్ చేసేందుకు ఇక్కడి ప్రజలకు కష్టతరంగా మారుతుందని లిటిగెంట్లు చెప్పారు. ఇక వివాదం నెలకొన్న భూమికి దగ్గరలోనే మసీదు నిర్మాణంకు భూమి కేటాయించాలంటూ కేసులో ముఖ్య పిటిషన్‌దారుడిగా ఉన్న హషీం అన్సారీ కుమారుడు ఇక్బాల్ అన్సారీ కోరాడు. ఇక ఆ భూమిని అంగీకరిస్తుందా లేదా అనేది సున్నీ వక్ఫ్ బోర్డు నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నాడు.

అక్కడే ఎందుకు కేటాయించారో ప్రభుత్వం వివరణ
ఇక మసీదు నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించిన భూమి లక్నో హైవేకు సమీపంలో ఉందని జిల్లా హెడ్‌క్వార్టర్స్ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పారు యూపీ మంత్రి శ్రీకాంత్ శర్మ. ఇక పండగలు వేడుకల సమయంలో అయోధ్య పట్టణం చుట్టూ పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని ఆ సమయంలో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే లక్నో హైవే మీద స్థలం కేటాయించినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. పరికర్మ పరిధిలోకి రాకుండా స్థలం కేటాయించాలని పలువురు హిందూ పెద్దలు ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రభుత్వం మాత్రం మరో వెర్షన్ వినిపిస్తోంది. కేటాయించి స్థలం హైవేకు దగ్గరగా ఉండటం, ఆ ప్రాంతంలో ముస్లిం జనాభా అధికంగా ఉండటం, ఆ ప్రాంతంలో ఎప్పుడూ మత ఘర్షణలు జరిగిన చరిత్ర లేకపోవడంతోనే ఆ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.

రాజకీయాలకు చెక్ పెట్టి అభివృద్ధిపై పోరాడుదాం
ఇక ఇప్పటి వరకు కేసులో వాదించిన లాయర్ జాఫర్యాబ్ జిలానీ తను సున్నీ వక్ఫ్ బోర్డు తరపున వాదనలు వినిపించేది లేదని చెప్పారు. వక్ఫ్ బోర్డు స్టాండ్ వేరుగా ఉండటంతో తాను ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తరపున క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే సున్నీ మతపెద్ద మౌలానా ఖాలీద్ రషీద్ ఫరంగి మహాలి మాత్రం అయోధ్య రామమందిరం బాబ్రీ మసీదు భూవివాదంకు ఇంతటితో చెక్ పెట్టాలని పిలుపునిచ్చారు. దీనిపై జరిగిన రాజకీయాలకు శుభం కార్డు పలకాలని వెల్లడించారు. ఇకపై ఆరోగ్యం, ఆర్థికాభివృద్ధి, నిరుద్యోగిత సమస్యలపై పోరాడాలని అన్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications