వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ 17కులాలను ఎస్సీల్లో చేర్చాలని సీఎం నిర్ణయం..

యూపీలోని వెనుకబడిన (ఓబీసీ) 17కులాలను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ నిర్ణయం తీసుకున్నారు.

|
Google Oneindia TeluguNews

లక్నో: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ తీసుకున్న నిర్ణయం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కులం కార్డును ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకు అఖిలేష్ యాదవ్ శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం యూపీలోని వెనుకబడిన (ఓబీసీ) 17కులాలను ఎస్సీ జాబితాలో చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్రం ఆమోదం కోసం పంపించారు. కేంద్రం గనుక ఆమోదం తెలిపిదే ఈ 17కులాల వారికి ఎస్సీ రిజర్వేషన్లు వర్తిస్తాయి. వచ్చే ఏడాది జరగబోయే యూపీ ఎన్నికలను పార్టీకి అనుకూలంగా మార్చేందుకే అఖిలేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు.

Akhilesh

ఆ 17 కులాలు ఇవే:

కహర్, కశ్యప్, కేవత్, నిషాద్, బింద్, బహర్, ప్రజాపతి, రాజ్ భర్, బథాం, గౌర్, తురా, మఝీ, మల్హా,ధీమర్, మచౌ, వీటితో పాటు మరో మూడు కులాలను ఎస్సీ జాబితాలో చేర్చాలని అఖిలేష్ సర్కార్ యోచిస్తోంది.

కాగా, 17కులాలను ఓబీసీల్లో చేర్చాలన్న తీర్మానాన్ని గత 2013మార్చిలో జరిగిన అసెంబ్లీ ఆమోదించింది. యూపీఎస్సీ, ఎస్టీ రీసెర్చ్ ట్రెయినింగ్ ఇనిస్టిట్యూట్ సమగ్ర అధ్యయనం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రభుత్వం తీర్మానంలో పొందుపరిచింది.

English summary
Playing the caste card ahead of Assembly elections, the Akhilesh Yadav government on Thursday gave its assent to include 17 Other Backward Castes in the Scheduled Castes (SC) list.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X