బీజేపీకి షాక్: యూపీ స్థానిక పోరులో ఎస్పీ అఖిలేశ్ జోరు, మోదీ వారణాసి, అయోధ్యలో కమలం డీలా
ఇంకొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ లో అధికార బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలాయి. మంగళవారం వెలువడిన పంచాయితీ ఎన్నికల ఫలితాల్లో అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పీ) సత్తా చాటుకుంది. పార్టీ గుర్తులు లేకుండా జరిగిన జిల్లా, క్షేత్ర(మండల), గ్రామ పంచాయితీ ఎన్నికల్లో అడుగడుగునా బీజేపీకి ఎస్పీ, ఇతర ప్రతిపక్షాలు దీటుగా నిలిచాయి.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తోన్న వారణాసితోపాటు బీజేపీ రాజకీయ ఎదుగుదలకు కేంద్రమైన అయోధ్యలోనూ ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులు చేదు అనుభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. వారణాసిలోని 40 జిల్లా పంచాయతీ సీట్లకుగానూ ఎస్పీ 15 సీట్లను కైవసం చేసుకోగా, బీజేపీ కేవలం 8 సీట్లకే పరిమితమైంది. అయోధ్యలో 40 జిల్లా పంచాయతీ సీట్లకు గాను 24 సీట్లు సమాజ్‌వాదీ పార్టీ గెలుచుకోగా, బీజేపీ కేవలం 6 సీట్లకు పరిమితమైంది. మిగిలిన 10 సీట్లలో మాయావతి సారథ్యంలోని బీఎస్‌పీ 5, ఇండిపెండెంట్లు 5 గెలుచుకున్నారు.

యూపీలో మొత్తం 58,176 గ్రామ పంచాయితీల్లో 7.32 లక్షల వార్డులకు, 3,050 క్షేత్ర(మండల) పంచాయితీల్లోని 75,852 వార్డులకు, 75 జిల్లాల్లోని 3,050 జిల్లా పంచాయితీ స్థానాలకు ఏప్రిల్ చివరి వారంలో ఎన్నికలు జరగ్గా, వాటి ఫలితాలు మంగళవారం వెల్లడయ్యాయి. బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరగడంతో కౌంటింగ్ ప్రక్రియ నిదానంగా సాగుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు..
మొత్తం 3,050 జిల్లా పంచాయితీ సీట్లలో బీజేపీ బలపరచిన అభ్యర్థులు 918 చోట్ల లీడింగ్‌లో ఉండగా, ఎస్‌పీ బలపర్చిన అభ్యర్థులు 504 సీట్లలో అధిక్యంలో ఉంన్నారు. బీఎస్పీ బలపర్చిన అభ్యర్థుల్లో 132 మంది, కాంగ్రెస్ నుంచి 62 మంది, ఇండిపెండెట్లు 608 మంది లీడింగ్ లో ఉన్నారు. రాజకీయపరంగా వారణాసి, అయోధ్యలను కీలకంగా భావించే బీజేపీ అక్కడి స్థానిక ఎన్నికల్లో ఓడిపోవడం హెచ్చరిక లాంటిదేనని పార్టీనేతలు అంగీకరించారు. యూపీ పంచాయితీ ఎన్నికల తుది ఫలితాలకు ఇంకా సమయం పడుతుంది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్












Click it and Unblock the Notifications