రాప్టింగ్: గంగానదిలో కొట్టుకుపోయిన ఉత్తరప్రదేశ్ మంత్రి కుమార్తె
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌కు చెందిన కేబినెట్ మంత్రి కుమార్తె గంగానదిలో పడి కోట్టుకుపోయింది. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన లేబర్ మంత్రి షాహిద్ మంజూర్ కుమార్తె అబిదా హాసన్ మీరట్‌లోని ఓ కాలేజీలో వైద్య విద్య (ఎమ్‌డీ)ను అభ్యసిస్తున్నారు. కాలేజీ టూర్‌లో భాగంగా కాలేజీ యాజమాన్యం వారిని ఉత్తరాఖండ్‌కు తీసుకెళ్లింది.

ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ వద్ద ఉన్న గంగానదిలో రాఫ్టింగ్ చేసేందుకు తెప్పలో నదిలోకి ప్రవేశించారు. నీళ్ల ప్రవాహాం ఒక్కసారిగా పెరగడంతో తెప్పతో పాటు మంత్రి కుమార్తె కూడా కొట్టుకుపోయింది. ఈ సంఘటన రిషికేశ్‌లోని పూల్ చాటీ ప్రాంతంలో ఉదయం 8 గంటలకు జరిగింది.
సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్ధలానికి చేరుకుని ఆమె ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.












Click it and Unblock the Notifications