చిన్మయానంద కేసు : కోర్టుకు హజరైన యూపీ లా విద్యార్థిని

బీజేపీ చిన్మయానంద్ పై అత్యచారం,బ్లాక్‌మెయిల్ అరోపణలు చేసిన ఉత్తరప్రదేశ్ లా విద్యార్థిని స్టేట్‌మెంట్ తీసుకోవడం కోసం ఆమేను కోర్టుకు తీసుకువచ్చారు. అయితే ఆమేపై దాడులు చేసే అవకాశం ఉండడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కోర్టుకు తీసుకువచ్చారు. కోర్టుకు తీసుకువచ్చే సమయంలో ఎవ్వరికి కనబడకుండా ముఖానికి ముసుగేసుకుని తీసుకువచ్చారు. కేసు దర్యాప్తుకు సంబంధించి సుప్రిం కోర్టు ఆదేశాలతో ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు యూపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

 12పేజీల స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన సిట్

12పేజీల స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన సిట్

లా విద్యార్ధి కేసును విచారించేందుకు సుప్రిం కోర్టు సిట్‌ను ఏర్పాటు చేయడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ప్రారంభించింది. సిట్ పోలీసుల విచారణలో లా విద్యార్ధి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. చిన్మయంద తనను ఎప్పుడు కలిసింది,ఆయన ఏ విధంగా వేధింపులకు పాల్పడింది వివరించింది. మొత్తం 12 పేజీల స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేసినట్టు సమాచారం. విచారణలో భాగంగానే చిన్మయనందా తనకు ఆశ్రయమించి నమ్మించాడని తనకు సంబంధించిన హస్టల్లో ఉంటున్న తనకు ఆశ్రయమిచ్చి స్నానం చేస్తుండగా వీడీయోలు తీయించాడని చెప్పింది. వీడీయో చూపించి తనను బ్లాక్‌మెయిల్‌ చేశాడని చెప్పింది. సంవత్సరకాలంగా పలుసార్లు అత్యాచారం చేశాడని పోలీసులకు తెలిపినట్టు సమచారం.

ఆశ్రయమిచ్చి నమ్మించాడు

ఆశ్రయమిచ్చి నమ్మించాడు

కాగా గత సంవత్సరం జూన్‌లో అడ్మిషన్ కోసం స్వామి చిన్మయానందను కలిశానని, అడ్మిషన్ ఇచ్చిన అనంతరం తన ఫోన్ నెంబర్ చిన్మయానంద తీసుకున్నారని చెప్పింది. అనంతరం తానే ఫోన్ చేసి తన లైబ్రరీలో ఉద్యోగం ఇస్తానని చెప్పాడని తెలిపింది. అయితే తన కుటంభం బీదరికంలో ఉండడంతో తాను ఆ ఉద్యోగం చేశానని వివరించినట్టు తెలుస్తోంది. ఉద్యగం తర్వాత గత ఆక్టోబర్‌రులో ఆశ్రయంలో ఉండమని పిలిచాడని తెలిపింది. మరోవైపు హాస్టల్ బాత్రూంలలో తీసిన వీడీయో చూపించి బెదిరించాడని కొన్ని సమయాల్లో తన గన్‌మెన్‌లతో బెదిరించాడని చెప్పింది.ఇలా ఈ సంవత్సరం జూన్ వరకు వేధింపులకు గురి చేశాడని తెలిపినట్టు సమాచారం.

చిన్మయానందకు నోటీసులు జారీ చేసిన సిట్

చిన్మయానందకు నోటీసులు జారీ చేసిన సిట్

సిట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించిన సుప్రిం కోర్టు వేధింపుల అంశాన్ని కొంతమంది అడ్వకేట్స్ సుప్రిం కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో సుమోటగా స్వికరించింది. విచారణ అనంతరం కేసుకు సంబంధించి ప్రత్యేక ఇన్విస్టిగేషన్ టీంను (సిట్ ) ను ఐజి ర్యాంకు అధికారితో ఏర్పాటు చేయాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కొద్ది రోజుల క్రితం సుప్రిం కోర్టు ఆదేశించింది. దీంతోపాటు కేసును విచారించేందుకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయాలని అలహాబాద్‌ హైకోర్టును సైతం అదేశించింది. కాగా కొద్ది రోజుల క్రితం సిట్ పోలీసులు సుమారు 11 గంటలపాటు ఆమేను విచారించారు. అనంతరం చిన్మయానందపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన్ను విచారించేందుకు నోటీసులు అందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+