ఇద్దరు యువతుల మద్య స్వలింగ సంపర్కం: చిన్నారి హత్య, కారణమిదే
ఇద్దరు యువతుల మధ్య స్వలింగ సంపర్క సంబంధం నాలుగేళ్ల చిన్నారి హత్యకు దారితీసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మావ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు బాధ్యురాలైన నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.
లక్నో: ఇద్దరు యువతుల మధ్య స్వలింగ సంపర్క సంబంధం నాలుగేళ్ల చిన్నారి హత్యకు దారితీసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మావ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు బాధ్యురాలైన నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.
స్వలింగ సంపర్కులకు ఇతర దేశాల్లో చట్టబద్దత ఉంది. అయితే ఇండియాలో మాత్రం ఈ తరహ పద్దతులను వ్యతిరేకిస్తారు. అయితే కారణాలు ఏమిటో కానీ, యూపీ రాష్ట్రంలో మాత్రం ఇద్దరు యువతుల మధ్య స్వలింగ సంపర్కం అలవాటైంది.
అయితే వీరిద్దరి మద్య స్వలింగ సంపర్కం ఓ బాలిక హత్యకు దారితీసింది. ఈ ఘటనకు కారణమైన నిందితురాలను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇద్దరు యువతుల మధ్య స్వలింగ సంపర్కం
ఉత్తర్ ప్రదేశ్ రాష్రంలోని మావ్ జిల్లాలోని పక్క పక్కనే ఉండే ఇరుగు పొరుగు యువతుల మధ్య స్వలింగ సంపర్కం ఏర్పడింది. అయితే ఈ విషయాన్ని తెలుసుకొన్న తల్లిదండ్రులు ఇద్దరు యువతులను కలుసుకోకుండా కట్టడి చేశారు. ఒక యువతిని ఊరి నుండి వేరే ఊరికి పంపించారు.దీంతో ఇద్దరు యువతులు కలుసుకొనే అవకాశం లేకుండా పోయింది.

ఫంక్షన్ కోసం స్వగ్రామానికి వచ్చి
ఫంక్షన్ కోసం వేరే గ్రామానికి పంపిన యువతి స్వగ్రామానికి తిరిగి వచ్చింది. అయితే స్వగ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత తన ఇంటి పక్కనే ఉన్న తన జోడిగా ఉండే యువతిని కలుసుకొనేందుకు ఎదురుచూసింది. కానీ, రెండు కుటుంబాల సభ్యులు ఇద్దరు యువతులను కలుసుకోకుండా కట్టడి చేశారు. అయితే ఇద్దరు ఒక రహస్య ప్రాంతంలో కలుసుకోవాలని సమాచారాన్ని మార్పిడి చేసుకొన్నారు.

యువతి కోసం ఎదురు చూస్తుండగా
గ్రామంలో ఫంక్షన్ వాతావరణం నెలకొంటే ఊరి నుండి తిరిగి వచ్చిన యువతి మాత్రం తన జోడి కట్టే యువతి కోసం తాము ప్రతి సారీ కలుసుకొనే చోటులో ఎదురుచూస్తోంది. అయితే పొరపాటున ఆ స్థలానికి ఆమె నాలుగేళ్ళ వయస్సున్న సోదరి వచ్చింది. అయితే తనతో జోడి కట్టే యువతి గురించిన సమాచారాన్ని ఆ బాలికను అడిగింది. అయితే ఆ బాలిక సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయేందుకు ప్రయత్నించింది. అయితే కోపంతో ఆ బాలిక నోరు మూసింది. అయితే శ్వాస ఆడక ఆ బాలిక చనిపోయింది. ఆ బాలిక మృతదేహంపై బల్ల వేసి ఆ యువతి పారిపోయింది.

హత్య ఇలా వెలుగులోకి
బాలిక చనిపోయిన ప్రదేశం నుండి దుర్గంధం వస్తున్న విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ హత్య విషయం వెలుగు చూసింది.
సాధారణంగా ఎప్పుడూ తాళం వేసి ఉండే ఆ ఇంట్లో ఇస్మాత్ శవం కనిపించడంతో ఆ ఇంటి యజమాని బద్రిసేథ్, అతని కుమారుడు మనీశ్‌ను అరెస్టు చేశారు. తండ్రి, సోదరుడిని అరెస్టు చేయడంతో పాటు... పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నిందితురాలు తన నేరాన్ని అంగీకరించినట్టు ఎస్పీ వివరించారు.












Click it and Unblock the Notifications