పామును పట్టి, కాటుకు గురై, మూలికలతో వైద్యం చేయడంతో మృతి
విష సర్పాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వాటిని పట్టేవారు అయినా సరే అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ప్రాణ త్యాగం తప్పదు. అవును ఉత్తరప్రదేశ్ షాజహన్ పూర్‌లో ఇలాంటి ఘటన జరిగింది. పాములు పట్టే ఒకతను.. విషసర్పానికి బలి అయ్యాడు. అదీ కరిచిన తర్వాత కూడా.. మూలికలతో వైద్యం చేసుకున్నాడు. ఏమీ కాదులే అని అనుకున్నాడు. కానీ చివరికీ తన ప్రాణాలనే తీసుకున్నాడు.
షాజహన్ పూర్‌కు చెందిన దేవేంద్ర మిశ్రా.. పాములను పట్టేవాడు. అయితే తన పొరుగింటిలో కూడా విషసర్పం ఉందని తెలుసుకున్నాడు. వెళ్లి దానిని పట్టుకున్నాడు. అదీ అత్యంత విషపూరితమైన పాము.. కానీ అదీ అతని మెడపై కాటేసింది. కర్రతోనే పామును పట్టుకున్న అతను.. ఓ చిన్నారి మెడలో కూడా దానిని వేశాడు.

అతను పామును పట్టుకున్న రెండు గంటల తర్వాత కాటు వేసింది. వెంటనే ఆస్పత్రికి వెళితే బాగుండేది. కానీ వివిధ మూలికల ద్వారా ట్రీట్‌మెంట్ తీసుకున్నాడు. దీంతో ఆలస్యమైంది. కాసేపటి తర్వాత అతను ఇంటిలోనే చనిపోయాడని స్థానికులు తెలియజేశారు. విషసర్పాలను పట్టుకోవడంలో సిద్దహస్తుడు అయిన మిశ్రా.. చివరికీ ఆ పాము చేతిలోనే చనిపోయారు.ఆస్పత్రిలో వైద్యం చేసుకుంటే అతను బతికేవాడు.. కానీ అలా చేయకపోవడంతో మృత్యువాత పడ్డాడు. విష సర్పాలను పట్టుకోవడం వరకు ఓకే.. కానీ అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే మిశ్రా మాదిరిగానే చనిపోతారు. సో.. మిగతా స్నేక్ హంటర్స్ అయిన తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications