సచిన్! జాగ్రత్త, ఆ పార్టీలు వాడుకొని వదిలేస్తాయి: నరద్

లక్నో: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్‌కు సమాజ్‌వాది పార్టీ(ఎస్పీ) ఆహ్వానం పలకడమే కాకుండా, కాంగ్రెసు, బిజెపిల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సచిన్ టెండుల్కర్ రాజకీయ ఇన్నింగ్స్ ప్రారంభించాలనుకుంటే తమ పార్టీలో చేరవచ్చునని ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి నరద్ రాయ్ ఆదివారం సూచించారు.

అదే సమయంలో కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీలను నమ్మవద్దని సచిన్‌కు సూచించారు. ఆ రెండు పార్టీలు యూజ్ అండ్ త్రో పాలసీని అవలంభిస్తాయని ఆరోపించారు. వాడుకొని వదిలేసే అలాంటి పార్టీల పట్ల సచిన్ టెండుల్కర్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాస్టర్‌కు భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ఇవ్వడాన్ని ఆయన స్వాగతించారు.

 UP minister offers Sachin Tendulkar to join SP

కాగా సచిన్ టెండుల్కర్ అంతర్జాకీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. వెస్టిండీస్‌తో సొంత మైదానమైన వాంఖేడే స్టేడియంలో తన చివరి, 200వ టెస్టు మ్యాచ్‌ను సచిన్ ఆడారు. కుటుంబ సభ్యులు, ఎందరో ప్రముఖులు సచిన్ చివరి మ్యాచును తిలకించారు.

వెస్టిండీస్‌తో మ్యాచ్ ముగిసి, సచిన్ తన రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే అతనికి భారతరత్న ఇస్తున్నట్లు ప్రకటించారు. భారతరత్న రావడంపై అందరూ హర్షం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+