"ఇలా చనిపోతే నేరుగా స్వర్గానికే..": వరద బాధితులకు మంత్రి ఝలక్!

UP Minister Controversy: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహాత్ జిల్లాలో వరద బాధితులను కలవడానికి వెళ్లిన రాష్ట్ర మంత్రి సంజయ్ నిషాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు వార్తల్లో నిలిచాయి. వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు ఓదార్పునివ్వాల్సిన మంత్రి వారితో.. "గంగామాత గంగా పుత్రుడి పాదాలు కడగడానికి వస్తుంది. అలాంటప్పుడు ఆ వ్యక్తి నేరుగా స్వర్గానికి వెళ్తాడు" అని చెప్పడం విమర్శలకు దారితీసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అసలేం జరిగిందంటే?
ఉత్తరప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో ఇటీవల గంగా, యమున నదులలో నీటిమట్టం పెరిగి భారీ వరదలు వచ్చాయి. ఈ వరదల కారణంగా వందలాది గ్రామాలు నీట మునిగాయి. పంటలు, ఇళ్లు, మార్కెట్లు అన్నీ ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో వరద బాధితులను పరామర్శించడానికి మంత్రి సంజయ్ నిషాద్ కాన్పూర్ దేహాత్ జిల్లాలోని భోగ్నిపూర్ తహసీల్ ప్రాంతానికి వెళ్లారు.అక్కడ ఒక గ్రామంలోని ప్రజలు తమ ఇళ్లు కూలిపోయాయని, తాము ఇప్పుడు ఎక్కడ ఉండాలని మంత్రిని కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సమాధానంగా మంత్రి, "గంగామాత గంగా పుత్రుడి పాదాలు కడగడానికి వస్తుంది. ఆమె దర్శనంతోనే గంగా పుత్రుడు నేరుగా స్వర్గానికి వెళ్తాడు. ప్రతిపక్షాలు మీకు తప్పుడు విషయాలు బోధిస్తాయి" అని వ్యాఖ్యానించారు.

UP Minister Sanjay Nishad s Controversial Comments on Flood Victims Spark Outrage

మంత్రి వ్యాఖ్యలతో వరద బాధితులు ఆశ్చర్యపోయారు. ఆ ప్రాంతంలో గంగా నది కాదని, యమునా నది ప్రవహిస్తుందని మంత్రికి తెలియదని కొందరు బాధితులు నిరాశగా వ్యాఖ్యానించారు. ఈ పర్యటనలో ఒక నాయకుడు ఒక వృద్ధ మహిళతో, "యమునామాత మీకు దర్శనం ఇవ్వడానికి రావడం మీ అదృష్టం" అని చెప్పగా, ఆ మహిళ ఆ నాయకుడికి అదే మాటల్లో గట్టిగా బదులిచ్చింది: "అయితే మీరు కూడా ఇక్కడే ఉండి ప్రతిరోజు దర్శనం చేసుకోండి!" అని వ్యంగ్యంగా జవాబిచ్చింది.

ప్రభుత్వ సహాయక చర్యలు
భారీ వర్షాలు, వరదల కారణంగా భోగ్నిపూర్‌లోని అనేక గ్రామాలు మునిగిపోయాయి. వందలాది పశువులు కొట్టుకుపోయాయి. రైతుల పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 'టీమ్ 11'ను ఏర్పాటు చేసి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులకు సహాయం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ సంజయ్ నిషాద్ వంటి మంత్రులు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు బాధితులను మరింత నిరాశపరుస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+