అఖిలేష్ వర్సెస్ ములాయం: అదంతా ప్యామిలీ డ్రామా.. వెంకయ్య
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అధికార సమాజ్‌వాదీ పార్టీలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. దీనిపై కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు ఆదివారం నాడు స్పందించారు.
లక్నో/న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అధికార సమాజ్‌వాదీ పార్టీలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. దీనిపై కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు ఆదివారం నాడు స్పందించారు. యూపీలో కుటుంబ నాటకం జరుగుతోందని ఎద్దేవా చేశారు.

యూపీ ప్రజలు ఎస్పీ, బీఎస్పీ పార్టీల పట్ల విసిగిపోయి ఉన్నారన్నారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందన్నారు. బీజేపీ వైపు మళ్లేందుకు ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు.
సమాజ్ వాది పార్టీలో హైడ్రామా
అఖిలేష్ వర్గాన్ని పక్కన పెట్టి నాలుగు రోజుల క్రితం ములాయం ఎన్నికల్లో పోటీ చేసే వారి జాబితాను ప్రకటించారు. పోటీగా అఖిలేష్ యాదవ్ తన వర్గాన్ని మరుసటి రోజు ప్రకటించారు.
దీంతో రెండు రోజుల క్రితం అఖిలేష్ యాదవ్‌ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించారు. ఆ తర్వాత శనివారం నాడు అంతా సద్దుమణిగినట్లు కనిపించినా, ఆదివారం మళ్లీ ముసలం కనిపించింది.
ఆదివారం ఉదయం అఖిలేష్ యాదవ్, ములాయం సోదరుడు, అఖిలేష్ వర్గం నేత రాంగోపాల్ యాదవ్, పార్టీ నాయకులు సమావేశమయ్యారు. ఈ భేటీలో అఖిలేష్‌ను జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ములాయంను తొలగించారు. అలాగే, అమర్ సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. శివపాల్ యాదవ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించారు.
ఈ నేపథ్యంలో మధ్యాహ్నానికే ములాయం సింగ్ యాదవ్ తన తనయుడు అఖిలేష్‌కు తన పవర్ చూపించారు. రాంగోపాల్ యాదవ్ పైన ఆరేళ్ల పాటు వేటు వేశారు. దీంతో యూపీ రాజకీయాలు.. ప్రధానంగా ఎస్పీలో హైడ్రామా కొనసాగుతోంది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications