వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారు పేదలే కాని మత సామరస్యానికి పెద్దలు.. ! ముస్లీం యువతి పెళ్లి కార్డుపై సీతారాములు

|
Google Oneindia TeluguNews

షాజహాన్‌పూర్ : కొందరు స్వార్థపరులు కులాల పేరిట కుంపట్లు పెడుతున్నారు. మతాల పేరిట మంటలు రేపుతున్నారు. ఓటు బ్యాంకు కోసమో, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమో జనాలను వేరుచేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మారుతున్న కాలంలో జనాల ఆలోచన ధోరణి కూడా మారుతోంది. రాజకీయ నేతల మాటలు నమ్మకుండా కలిసికట్టుగా ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు. ఆ క్రమంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ ముస్లిం కుటుంబం చేసిన ప్రయత్నం దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

సంకలో పిల్ల, ఊరంతా వెతికినట్లు.. పక్కింట్లో బిడ్డ, 5 రోజులు గాలింపుసంకలో పిల్ల, ఊరంతా వెతికినట్లు.. పక్కింట్లో బిడ్డ, 5 రోజులు గాలింపు

చిలౌవా గ్రామంలో నివసించే ముస్లిం కుటుంబం తమ ఇంట్లో పెళ్లి వేడుక సందర్భంగా వినూత్న నిర్ణయం తీసుకున్నారు. మతసామరస్యం పెంపొందించేలా రుఖ్సార్ బానో అనే యువతి వెడ్డింగ్ కార్డుపై సీతారాముల ఫోటో ముద్రించారు. మతాలు వేరైనా హిందూ ముస్లింలు ఒక్కటేనని చాటిచెప్పేందుకు ఈ ప్రయత్నం అంటున్నారు ఆ ఫ్యామిలీ మెంబర్స్.

UP MUSLIM FAMILY PUTS SITA RAMA PHOTO ON WEDDING CARD TO SPREAD COMMUNAL HARMONY

ఇక్కడ హిందుముస్లింలంతా కులమతాలకు దూరంగా ఉంటున్నాం. ఒకరినొకరం అర్థం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. మా గ్రామంలో వికసిస్తున్న మతసామరస్యం దేశానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే పెళ్లికార్డుపై సీతారాముల ఫోటో ముద్రించాం. గ్రామస్థులంతా మా నిర్ణయంతో ఏకీభవించారు. మా ఆహ్వాన పత్రికను స్వీకరించారు. ప్రతి ఒక్కరూ మాకు మద్దతు తెలపడం ఆనందంగా ఉందంటూ ఆ యువతి తల్లి, సోదరుడు సంతోషం వ్యక్తం చేశారు.

English summary
To spread communal harmony, a Muslim family in Uttar Pradesh's Chilauwa village has printed image of Lord Ram and Sita on wedding invitation cards of their daughter Rukhsar. "In this village, both Hindus and Muslims live together. We want to promote communal harmony amongst people. We should not divide ourselves on the basis of our religion," said Rukhsar's mother, Baby.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X