నర్సుగా ఆస్పత్రికి వెళ్లిన మరుసటి రోజే గోడకు వేలాడుతూ శవమైన యువతి: హత్యాచారమేనా?
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉన్నావ్‌లోని నవ్ జీవన్ ఆస్పత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నర్సుగా ఉద్యోగంలో చేరిన మరుసటి రోజే ఓ యువతి ఆస్పత్రి గోడకు శవంగా వేలాడింది. అత్యాచారం చేసి హత్య చేశారని బాధితురాలి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ఈ ఆస్పత్రిని ఐదు రోజుల క్రితమే ప్రారంభించడం గమనార్హం. శుక్రవారం ఈ ఆస్పత్రిలో ఓ యువతి నర్సుగా ఉద్యోగంలో చేరింది. శనివారం ఉదయం ఆస్పత్రి గోడకు ఉన్న పిల్లర్ ఊచలకు వేలాడుతూ ఆమె శవం కనిపించింది. ఆమె మెడకు తాడుతో ఉచ్చు బిగించి ఉంది. తమ కూతురుపై అత్యాచారం చేసి, హత్య చేసి ఉంటారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు పోలీసులు.

ఈ ఘటనపై సీనియర్ పోలీస్ అధికారి శశిశఏఖర్ సింగ్ మాట్లాడుతూ.. న్యూ నవజీవన్ ఆస్పత్రి వద్ద ఓ యువతి మృతదేహాన్ని గుర్తించామని తెలిపారు. మృతికి గల కారణాలు తెలుసుకోవడానికి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు చెప్పారు. యువతి కుటుంబసభ్యులు ఆరోపణల మేరకు ముగ్గురి పై కేసు నమోదు చేసినట్లు సదరు అధికారి తెలిపారు.
ఉన్నావ్‌లో సంచలనంగా మారిన ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, ఉన్నావ్‌లోనే గతంలోనే మహిళలపై నేరాలు అత్యధిక జరిగని చరిత్ర ఉంది. ఇక్కడి ఎమ్మెల్యే కుల్దీస్ సెంగర్ కూడా మహిళపై దాడి కేసులోనే జైలు శిక్ష అనుభవించడం గమనార్హం. బాలికపై అత్యాచారం, ఆమె తండ్రి మరణానికి కారణమయ్యాడనే ఆరోపణలు సదరు ఎమ్మెల్యేపై ఉన్నాయి.












Click it and Unblock the Notifications